గుడిలో హారతి గంట వెనుక రహస్యం ఏంటో తెలుసా..!?

-

గుడికి వెళ్ళినప్పుడు దేవుడుకి ఎదురుగా కనిపించేది గంట. గుడి ఎంత చిన్నదైనా సరే.. గంట మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇక గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవుడి దర్శననానికి వచ్చినప్పుడు గంట కొట్టడం భక్తులకు అలవాటు. అయితే గుడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గంట కొడతారు. అలాగే గుళ్లో దేవుడికి హారతి ఇచ్చినప్పుడు కూడా గంట కొడతారు. అసలు గంట ఎందుకు కొడతారు అనే సందేహాలు అందరికి ఉంటుంది.

bell

అయితే గంటలో ఉండే ప్రతి భాగానికి ఒక ప్రత్యేకత ఇమిడి ఉంది. గంట నాలుకలో సరస్వతీదేవి కొలువై ఉంటుందని, గంట ముఖభాగంలో బ్రహ్మదేవుడు, కడుపు భాగంలో రుద్రుడు, కొనభాగంలో వాసుకి, పిడి భాగం చక్ర, గరుడ, హనుమ, నంది మూర్తులతో ఉంటుందని పురాణాలు చెపుతున్నాయి. అందుకే ఈ గంటను సకల దేవతల స్వరూపంగా భావించి ముందుగా గంటను కొడతారు. కర్పూర హారతి ఇచ్చేటప్పుడు గంటకొట్టడానికి ఈ కారణాలు చెబుతూ ఉంటారు.

ఇక ఆలయాల్లో కర్పూర హారతి ఇచ్చే సమయంలో మనకి కలిగే అనుభూతి చెప్పలేనిది. ఆ వెలుగులో గంటల శబ్ధంలో దేవదేవతలను దర్శించుకోవడంతో అణువణువు పులకిస్తుంది. అయితే.. ఆ సమయంలో గంట కొట్టడం వలన ఆ ఘంటా నాదం అసుర గుణాలను తరిమి కొడుతుందని నమ్మకంతో గంట మోగిస్తారు.

అంతేకాక హారతి సమయంలో స్వామి వారి దివ్యదర్శనంలో భక్తులకు దర్శనమిస్తారు. అపుడు వెలిగే జ్యోతి దివ్య జ్యోతి. మనలోని అసుర గుణాలను తరిమికొట్టి.. విగ్రహరూపంలోని దైవాన్ని దర్శించుకుంటూ భక్తులు అంతర్ముఖులు కావాలన్నదే ఆ సాంప్రదాయానికి అర్థం హారతి ఇస్తున్నప్పుడు దేవతలనందరినీ ఆహ్వానిస్తున్నామనీ చెప్పడానికి గంట కొడుతారు. ఇక గంట కొడుతున్న సమయంలో ఆ దైవాంశ ఆ విగ్రహంలోనికి చేరాలని ప్రార్థిస్తున్నామని దాని సారాంశం. అయితే ఆ దైవాంశ విగ్రహంలోకి చేరినపుపడు ఉన్న రూపాన్ని హారతి వెలుగులో ఆలయంలో చూపడం జరుగుతోందని తెలుపుతుంది ఈ హారతిగంట. అందువల్ల హారతి ఇచ్చే సమయంలో దేవుడిని ప్రత్యక్ష దైవాంశ చేరిన రూపంగా దర్శించాలని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version