సాధారణంగా మనకి కొన్ని కోరికలు ఉంటాయి. అవి జరగాలని మనం అనుకుంటూ ఉంటాము. గుడికి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో పూజ చేసినప్పుడు కానీ అవి జరగాలని ఆ దేవుడిని కోరుకుంటూ ఉంటాము. పూజ చేసి ఆ పని పూర్తవ్వాలని వేడుకుంటూ ఉంటాం. కొందరు కోరిక కోరికగానే బయటకు చెప్తారు. కానీ నిజానికి దేవుడిని కోరుకున్న కోరికలు బయటకు చెప్పకూడదని పెద్దవాళ్ళు అంటారు.
మనం దేవుడిని ఏం కోరుకున్నా సరే బయటకు చెప్పకూడదు. దీని వెనుక గల కారణం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. మామూలుగా మనం దేవుడిని కోరుకునే కోరిక కాస్త పెద్దగా ఉంటుంది. పైగా అది జరగడం కష్టం. అందుకనే మనం భగవంతుని కోరుకుంటూ ఉంటాం. నిజానికి అలాంటి కోరికలు నెరవేరాయి అంటే అది గొప్ప విషయమనే చెప్పాలి.
ధనమైన, సుఖమైన, భర్త అయిన, భార్య అయిన, పదవైనా మరేదైనా కోరికని పైకి చెప్తే వినే వాళ్ళు ఆనందంగా కనిపించినా లోపల జరగకూడదని అనుకుంటారు. పైకి జరగాలని మీతో చెప్పినా లోపల మాత్రం కాస్తా జరగకూడదు అన్న ఇది లో ఉంటారు.
అందుకనే కోరిన కోరిక అసలు బయటికి చెప్పకూడదు. అలానే గుడికి వెళ్ళినప్పుడు తీర్థం నిలబడే తీసుకోవాలి. దర్శనం అయిన తరువాత కాసేపు కూర్చొని రావాలి. ఇలా నియమాలను తప్పనిసరిగా అనుసరించాలి.