శక్తి పీఠాల్లో ఒకటైన మంగళ గౌరీ ఆలయ విశేషాలు..!

-

మన భారత దేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాల్లో అంటూ అనేక దేవాలయాలు ఉన్నాయి. జ్యోతిర్లింగాలలో ఆ పరమ శివుడు కొలువై ఉంటే, శక్తి పీఠాల్లో అమ్మవారు విరాజిల్లుతుంది. మంగళ గౌరీ ఆలయం భారత దేశంలోని బీహార్ లో గల ‘గయా’ లో కొలువై అమ్మ వారు భక్తుల కోరికలు తీరుస్తుంది. ఈ ఆలయం క్రి.శ 15 వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తుంది. పురాణాల ప్రకారం సతి దేవి యొక్క శరీర భాగం ఇక్కడ పడినట్లు ఇతిహాసం.

ఆలయం గుంటలో అమ్మవారి తొడ భాగానికి ప్రతీకగా సాల గ్రామం ఉంటుంది. దీనినే మంగళ గౌరిగా పూజిస్తారు. ఈ ఆలయం లో ఎలక్ట్రిక్ దీపాలు లేకపోవడం తో చీకటిగా ఉంటుంది. ఈ గర్భ గుడి చక్కగా చెక్కిన పురాతన శిల్పాలను కలిగి ఉంటుంది. ఎవరైతే తన కోరికలతో ఈ అమ్మవారిని దర్శించుకుంటారో వారి కోరికలు తీరి తిరిగి ఆలయానికి వస్తారు.పురాణాల కథనం ప్రకారం పూర్వం దక్ష ప్రజాపతి చేసే యాగానికి ఆహ్వనం లేక పోయినా పార్వతి దేవి వెళ్తుంది.

అక్కడ ఆమెకు జరిగిన అవమాన భారం, శివ నింద భరించలేక యాగాగ్నిలో భస్మమైంది. సతీ వియోగం భరించలేని శివుడు మృత శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండి తన చేసే లోక కళ్యాణ కార్య క్రమాలు మానేసాడు. దీనితో మహావిష్ణువు ఆ దేహాన్ని తన సుదర్శన చక్రం తో పద్దెనిమిది ఖండాలుగా చేసి శివుడికి కర్తవ్య బోధ చేస్తాడు. విష్ణువు వధించిన పార్వతిదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలు పద్దెనిమిది శక్తి పీటాలుగా వెలిసాయి. అలా వెలిసిందే ఈ మంగళ గౌరీ ఆలయం.

Read more RELATED
Recommended to you

Latest news