విఘ్నాలను తొలగించే, దేవతలు అందరికీ ప్రథమ పూజాది పతి, కోరిన కోర్కెలు తీర్చే వక్ర తుండము గలవాడు అయిన శ్రీ లక్ష్మి గణపతి దేవాలయం తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు గ్రామంలో ఉంది. ఈ ఆలయం క్రీ. శ.9 వ శతాబ్దంలో తూర్పు చాణక్యుల కాలంలో క్రీ. శ.849 మధ్య క్రీ. శ.892 లో నిర్మించారు. ఇది నవాబుల కాలంలో విచ్ఛిన్న సమయంలో ఈ ఆలయం భూగర్భం లోకి వెళ్లిపోయింది.
తరువాత 1960 వ సంవత్సరంలో ఒక భక్తుని కలలో కనిపించి న స్వామి నేను భూమిలో ఉన్నాను అని చెప్పారు.అక్కడ తవ్వకాలు జరపగా ఆలయం కనపడింది. విగ్రహం బయటపడిన కొత్తలో చిన్నగా ఉంది. తరువాత భారీ గా పెరిగింది అని ఇక్కడి భక్తుల కథనం. ఈ స్వామికి చెవిలో ఏది చెప్తే అది జరుగుతుంది అని ఇక్కడి వారి నమ్మకం. ఇక్కడ వినాయక చవితి, మార్గశిర షష్ఠి నాడు ఉత్సవాలు చేస్తారు.
ప్రతి నెలా శుద్ధ చవితి నాడు లక్ష దూర్వ బిలాలతోపూజ, మూల మంత్ర జప తర్పణ హోమాలు, అభిషేకాలు, ఏకా దశ, గణపతి,రుద్ర, చండి హోమాలు చేస్తారు. ఈ ప్రాంగణంలో ఇంకా రాజరాజేశ్వరీ చంద్రశేఖర, గొలింగేశ్వర, పార్వతి, సుబ్రమణ్య స్వామి,నంది, నవ గ్రహాలు ఇలా శైవ కుటుంబం అంతా కొలువై ఉంది.