షెడ్యూల్ విడుదల కాకముందే వారికి న్యాయం చేయండి : వైఎస్ షర్మిల

-

ఆంధ్రప్రదేశ్ లో గ్రూపు-2, డిప్యూటీ ఈవో పోస్టుల ఎంపికలో అనుసరించిన విధానాన్ని గ్రూపు-1 పోస్టుల్లో కూడా పాటించాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఉద్యోగ అభ్యర్థుల సమస్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలోని గ్రూపు-1 అభ్యర్థుల పక్షాన మరోసారి సీఎం చంద్రబాబుని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. 1:100 విధానాన్ని గ్రూపు-1 మెయిన్స్ కి సైతం పరిగణలోకి తీసుకోవాలని కోరారు. 

అదేవిధంగా జీవో నెంబర్ 5 ప్రకారం.. 1:100 నిష్ఫత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసే అధికారం APPSCకి ఉందని.. ఆ అధికారాన్ని ఉపయోగించి రేషియో ప్రకారమే అవకాశం ఇవ్వమని అడగడంలో న్యాయం ఉందని తెలిపారు. 89 పోస్టులకు మీరు ఇచ్చిన 1:50 రేషియో ద్వారా 4450 మంది మెయిన్స్ కి అర్మత పొందారని.. 1:100 రేషియో ప్రకారం.. 4450 మందికి అవకాశం దక్కుతుందని అభ్యర్థులు ఆశ పడుతున్నట్టు తెలిపారు. గ్రూపు2, గ్రూపు1 పరీక్షల మధ్య సమయం తక్కువగా ఉండటం సిలబస్ మధ్య వ్యత్యాసం కొత్త సిలబస్ అని చెప్పి పాత సిలబస్ లోనే పరీక్షలు నిర్వహించడం వంటి కారణాలతో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version