జుట్టు విరబోసుకొని వెళితే దెయ్యాలు పడతాయా?

-

ఆరోజుల్లో ఆడవాళ్లు ఎంత చక్కగా తలస్నానం చేసి దువ్వుకొని జడ వేసుకొని తల నిండా పూలు పెట్టుకొని లక్షణంగా ఉండేవారు..కానీ ఈ ప్రస్తుత రోజుల్లో చాలామంది స్త్రీలు సంప్రదాయబద్ధంగా జడ అల్లుకుని పూలు పెట్టుకునే వారు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారని చెప్పవచ్చు.అది కూడా 40 ఏళ్లు పైబడిన వాళ్లే.. ఫంక్షన్లకు, ఏదైనా కార్యక్రమాలకు బయటకి వెళితే తప్ప అందంగా జడ వేసుకోవడానికి ఇష్టపడడం లేదు.. అది కూడా ఈ మధ్యకాలంలో వెంట్రుకలను విరబోసుకోవడం అన్నది ఫ్యాషన్ అయిపోయింది. ఇందులో కూడా రకరకాల హెయిర్ స్టైల్స్ వచ్చాయి. జుట్టుని చిన్నగా కట్ చేసుకుని క్లిప్పో, రబ్బరు బ్యాండో పెట్టి వదిలేస్తున్నారు..

ఈరోజుల్లో ఇదే ట్రెండ్ అయ్యింది.. చాలా మంది ఉన్న జుట్టును కట్ చేసి మరీ విరబోస్తున్నారు.. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు కూడా రెడీమెట్ జడలు అందుబాటులోకి వచ్చాయి..ఇక అయితే జడను ఎందుకు వేసుకోవాలి? జడ వేసుకోకుండా జుట్టు అలాగే విరబోసుకొని తిరగడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

ఒకప్పుడు జుట్టుని నచ్చినట్టు జడ వేసుకోవడం కాదు వయసుని బట్టి అల్లుకునేవారు. ఆడ పిల్లలు రెండు జడలు వేసుకుంటే ఆమె ఇంకా చిన్న పిల్ల అని, పెళ్లి కాలేదని అర్ధం.ఆ అమ్మాయిలో జీవేశ్వర సంబంధం విడి విడిగా ఉందని అర్థం. ఇక పెళ్లైన మహిళలు మొత్తం జుట్టుని ఒకటే జడగా వేసుకునే వారు. అంటే ఆమె తన జీవేశ్వరుడిని చేరి వివాహం చేసుకుని భర్తతో కలిసి ఉంటోందని అర్ధం.. జుట్టుని ముడి వేసుకుని కొప్పులా పెట్టుకుందంటే ఆమెకు సంతానం కూడా ఉందని, అన్ని బాధ్యతలను మోస్తూ గుట్టుగా ముడుచుకుంది అర్ధం. కొంతమంది మూడు పాయలతో కలిపి జడలుతూ ఉంటారు. దాని అర్థం.. తానూ, భర్త, తన సంతానం అని ఈ మూడు పాయలకు అర్ధం..

ఇక జుట్టు విరబోసుకుంటే పిశాచాలకు ఆహ్వానం పలకడమే అంటారు పండితులు. తలకి స్నానం చేసిన తర్వాత కూడా జుట్టు ఆరేలోగా కనీసం చివర్లైనా ముడివేయాలంటారు. జుట్టు విరబోసుకుని, క్లిప్పులు పెట్టుకుని దేవాలయానికి వెళ్లకూడదు. అలా చేస్తే జ్యేష్టా దేవి మీ వెంటే ఉంటుందట. అయితే మరి దేవతలు జుట్టు విరబోసుకుంటారు కదా అన్న ప్రశ్న మీకు రావచ్చు..ఏ దేవతా రూపమైన ఆది పరాశక్తి స్వరూపమే. దేవీ భాగవత అంతర్భాగంగా చూస్తే పరాశక్తి నిర్గుణ స్వరూపం. సత్వ,రజో,తమో గుణాలు ఆమెలో ఉండవు. అమ్మవారు కామాన్ని హరించేది. అందుకే దేవతలకు ఈ నియమం వర్తించదు.. అందుకే మనం ఎప్పుడు గుడికి వెళ్లినా కూడా చక్కగా జడ వేసుకొని వెళ్లాలని పండితులు చెబుతున్నారు..

 

Read more RELATED
Recommended to you

Exit mobile version