మనం గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఎన్నో రకాల కలలు వస్తుంటాయి..ఒక్కోసారి మంచి కలలు వస్తే, కొన్ని సార్లు పీడ కలలు కూడా వస్తాయి. కలలు మూడు రకాలు, జరిగేవి, జరగబోయేవి, జరిగినవి.. స్వప్న శాస్త్ర ప్రకారం కలలో ఎప్పుడూ కూడా భవిష్యత్తును సూచిస్తాయని చెబుతూ ఉంటారు. అయితే చాలావరకు మనకు కలలో వచ్చిన వస్తువులు కానీ మనకు వచ్చిన కలను కానీ మర్చిపోతూ ఉంటాం. కేవలం కొన్ని రకాల కలలు మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం.. కొన్ని రకాల కలలు శుభ సంకేతాలను సూచిస్తాయి..
కలల్లో ఎటువంటి కలలు వస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..కలలో తామర పువ్వు కనిపిస్తే భవిష్యత్తులో లక్ష్మీదేవి అనుగ్రహం , ఆశీర్వాదం తప్పకుండా పొందుతారని అర్థం. అలాగె చేతికి అందాల్సిన డబ్బు కూడా అందుతుంది. మీ కలలో తేనెపట్టు, తేనెటీగలు కనిపిస్తే అది చాలా శుభ సంకేతం. తియ్యటి తేనెను తెచ్చే తేనెటీగలు కనిపించడం అంటే మీ జీవితంలో ఆనందం రాబోతుందని అర్థం..
సాదారణంగా ఎన్నో రకాల వస్తవులు కలల్లో వస్తాయి.. కానీ, తేనేటీగలు, తామర పువ్వులు సామాన్యంగా కలలోకి రావు.. ఇల్లంతా వీటి ఫొటోలే పెట్టుకున్నా కనిపిస్తాయనే గ్యారెంటీ లేదు. కానీ కనిపిస్తే మాత్రం అదృష్టవంతులు అవ్వడం కాయం. తామర పువ్వు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే శుక్రవారం రోజు తామర పువ్వులతో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు.. అలాంటి తామర పువ్వులు కలలో కనిపించడం అంటే అదృష్టం అనే చెప్పాలి… లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది.. ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది..