మన దేశం సనాతనమైన ఆధ్యాత్మికతకు నెలవు. హిందువులు శివుడిని ఎక్కువగా పూజిస్తారు.మన దేశంలో అనేక శైవ దేవాలయాలు ఉనాయి. వాటిలో అతి ముఖ్యమైనవి ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఈ జ్యోతిర్లింగా లను జీవితంలో ఒక్కసారైనా దర్శిస్తే శివుని అనుగ్రహం కలిగి మోక్షం సిద్దిస్తుందని హిందువుల నమ్మకం.జ్యోతిర్లింగాలలో అయిదవదిగా ఉన్న వైద్యనాథ్ దేవాలయ విశేషాలు.
మహారాష్ట్రలో కంతి పూర్ దగ్గర పెద్ద శివాలయాన్ని జ్యోతిర్లింగంగా పూజిస్తారు. ఈ లింగాన్ని పూజిస్తే వారికి వ్యాధులు నయం అవుతుండడం వల్ల ఈ స్వామికి వైద్యనాథ్ అనే పేరు వచ్చింది. ఈయనను అమృతేశ్వరుడు అని కూడా అంటారు. క్షీర సముద్రంలో రాక్షసులు, దేవతలు కలిసి చేసిన అమృత మధన అనంతరం ధన్వంతరిని, అమృతమును ఈ లింగంలో దాచారని అందుకే ఈ లింగాన్ని తాకితే అమృతం వస్తుందని భక్తుల నమ్మకం. ఈ దేవాలయమ యొక్క చరిత్ర రామాయణ౦ లోని రావణునితో ముడిపడి ఉంది.
త్రేతా యుగంలో రాముని తో యుద్ధం చేయటానికి ముందు రావణాసురుడు శివుని గురించి గోరా తపస్సు చేసాడు. అప్పుడు రావణునికి గాయం అవ్వగా శివుడు వైద్యుడిగా మారి రావణునికి సపర్యలు చేసి గాయం నయం అయ్యేలాగా చేసింది ఈ ప్రాంతంలోనే. అందుకే ఇక్కడ గల పరమ శివునికి వైద్యనాథ్ అనే పేరు వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడ శ౦కరుడ్ని పూజిస్తే ఎంత మొండి వ్యాధులైనా తగ్గుతాయని భక్తుల నమ్మకం.