భక్తి: శుభం కలగాలంటే ఈ మొక్కలని మీ ఇంట్లో నాటండి..!

-

ఇంట్లో మొక్కలు పెంచితే చాలా అందంగా ఉంటుంది మరియు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మానసిక ప్రశాంతత కూడా మొక్కల ద్వారా మనకి లభిస్తుంది.. అయితే ఈ రోజు వాస్తు పండితులు ఇంట్లో ఎటువంటి మొక్కలు పెంచాలి ఎటువంటివి పెంచకూడదు అనేది చెప్పారు. మరి వాటి కోసం ఇప్పుడే తెలుసుకుందాం.

చాలా మంది ఇంటి బయట కానీ ఇంటి వెనకాల కానీ మొక్కల్ని పెంచుతూ ఉంటారు కొందరు అయితే ఈ మధ్యన టెర్రస్ గార్డెన్ లాంటివి కూడా చేస్తున్నారు. అటువంటి వాళ్లు తప్పకుండా వీటిని తెలుసుకోవాలి. దీంతో మీకు అనేక విషయాలు తెలుస్తాయి మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

ఇంట్లో వీలైనంత వరకు ముళ్ళు ఉన్న మొక్కలు నాటకుండా ఉంటే మంచిది. చాలా మందికి ముళ్ళ మొక్కలు ఇష్టం ఉండొచ్చు కానీ వాటిని ఇంట్లో పెట్టడం వల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుంది అని పండితులు అంటున్నారు.

ఎటువంటి పెంచితే పాజిటివ్ వస్తుంది అనేది చూస్తే.. తులసి మొక్క పెట్టడం వల్ల ఇంట్లో పాజిటివ్ పెరుగుతుందని అందుకనే ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పక తులసి మొక్క ఉండాలని పండితులు అంటున్నారు. సాధారణంగా అందరి హిందువులలో తులసి మొక్క ఉంటుంది. దీనిని ఉత్తర దిక్కులో పెట్టాలి లేదా తూర్పు దిక్కున పెట్టడం మంచిది.

ఇదిలా ఉంటే మల్లె మొక్క మొదలైన మొక్కలు కూడా ఇంట్లో ఉంటే మంచిది. సువాసన వచ్చే మొక్కలు ఇంట్లో ఉండడం వల్ల పాజిటివిటీ పెరుగుతుంది. అలాగే ఇంట్లో చింతచెట్టు ఉండటం వల్ల ఇబ్బందులు వస్తాయని పండితులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version