గురు పూర్ణిమ ప్రాముఖ్యత, ఆచరించాల్సిన పద్ధతులు…!

-

అజ్ఞానమనే అంధకారం నుండి విజ్ఞానం అనే వెలుగుని పంచుతారు గురువు… శిల్పి తన ఉలితో రాయిని చెక్కినట్లు అద్భుతంగా విద్యతో మారుస్తారు గురువు… విజ్ఞానమనే సారంతో జీవన దీపాన్ని వెలిగిస్తారు గురువు…

 

గురు పూర్ణిమ | Guru Purnima

ఇలా గురువు గురించి చెప్పుకుపోతే ఎంతో ఉంది. గురువులని ప్రతి ఒక శిష్యుడు గౌరవించాలి. అందుకే గురువుల్ని, పెద్దలని గౌరవించే రోజుగా గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పూర్ణిమ రోజున గురు పూర్ణిమ జరుపుకుంటాము.

ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు ఇవ్వడం వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకోవడం చేస్తూ ఉంటారు. గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని రోజులు పాటిస్తున్నా..

గురు పూర్ణిమ రోజు వ్యాస మహాముని పుట్టిన రోజు కనుక దీనికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం గురు పూర్ణిమ జూలై 24 వ తేదీన వచ్చింది. ఈరోజు షిరిడి సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి.

గురు పూర్ణిమ రోజున చేయవలసిన పనులు:

ఈ పర్వదినాన కొన్ని ఆలయాల్లో పూజలు ఘనంగా జరుగుతాయి. కొత్త అంగవస్త్రాన్ని పరిచి దాని మీద బియ్యం పోసి ఆ బియ్యం మీద చుట్టూ నిమ్మకాయలని ఉంచుతారు. ఆదిశంకరులు ఆయన నలుగురు శిష్యులు వచ్చి వాటిని అందుకుంటారని విశ్వాసం. ఆ తర్వాత పూజ చేసి ఓ పిడికెడు బియ్యం తీసుకుని తమ ఇళ్లలోని ఉండే బియ్యం లో కలుపుతారు అని పండితులు చెప్తున్నారు.

అలానే గురు పూర్ణిమ రోజున ముందు నుదుటన బొట్టు పెట్టుకుని.. ఆ తర్వాత పూజ చేయాలి అని పండితులు అంటున్నారు.
ఆ రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఆలయాల్లో ఆవు నేతితో దీపం వెలిగిస్తే సుఖ సంతోషాలు కలుగుతాయి.
వస్త్ర దానం కనుక గురు పూర్ణిమ రోజు చేస్తే సంతోషం కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు. ఆభరణం, గోదానం కూడా చేసుకోవచ్చు. ఇవి చేస్తే అష్టైశ్వర్యాలు ఉంటాయి.
గురు పౌర్ణమి రోజున ఉదయం 11 నుండి 12 గంటల లోపు పూజ చేయాలి. గురు పూర్ణిమ రోజు సాయిబాబా, దత్త స్తోత్రములు ధ్యానిస్తే మంచిది.
వ్యాస పౌర్ణమి రోజున పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేయించే వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version