మంగళసూత్రం విషయంలో ఇలాంటి పొరపాట్లు చేయకండి..!

-

మంగళసూత్రం ఎవరు పడితే వాళ్లు వేసుకోరు. దానికో పవిత్ర ఉంటుంది. కేవలం పెళ్లై భర్త ఉన్న వాళ్లు మాత్రమే మంగళసూత్రం ధరిస్తారు. దాన్ని ఏంతో పవిత్రంగా పూజిస్తారు. అయితే చాలా మంది మంగళసూత్రం విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. అవేంటో తెలుసుకుందామా.।!

మంగళసూత్రం

గళం అంటే శుభప్రదం-శోభాయమానం.. సూత్రం అంటే తాడు- ఆధారమని అని అర్థం..పెళ్ళైన స్త్రీకి అందం, ఐశ్వర్యం మెడలో తాళి బొట్టు. మంగళ సూత్రం భార్యా భర్తల శాశ్వత అనుభంధానికి గుర్తు. వైవాహిక జీవితంలో ఉండే సమస్త కీడును తొలగిస్తుందని హిందువుల నమ్మకం. శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళ సూత్రం ఉన్నంత వరకూ భర్త ఆరోగ్యంగా ఉంటాడని నమ్ముతారు. అయితే చాలామంది మంగళసూత్రం వేసుకోవడం మానేశారు..వారి సంగతి పక్కనపెట్టేస్తే హిందూ సంప్రదాయాలపై విశ్వాసంతో మంగళసూత్రం వేసుకునే మహిళలు కూడా తమకు తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తారు.

మంగళసూత్రం ఎలా ఉండాలంటే..

మంగళసూత్రం హృదయాన్ని తాకుతూ వక్షస్థలం కిందవరకూ ఉండాలి. సౌభాగ్యానికి ప్రతీకలైన పసుపు కుంకుమలను నిత్యం సూత్రాలకు పెట్టుకోవాలి చాలామంది మంగళసూత్రాల్లో పగడాలు, ముత్యాలు, అమ్మవారి రూపు పెట్టించుకుంటారు. ఇవి అందంగా ఉంటాయి కానీ సూత్రాలకు ఉండకూడదని పండితులు చెబుతున్నారు. సూత్రానికి ఇరువైపులా ఎరుపు, నలుపు పూసలు తప్పకుండా ఉండాలి

పిన్నీసులు వద్దు

మంగళ సూత్రాలకు చాలామంది పిన్నీసులు పెడుతుంటారు. కానీ అసలు సూత్రాలకు ఇనుము వస్తువు తగలకూడదు. ఎందుకంటే ఇనుము నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది. దీంతో బంధం మధ్య అన్యోన్యత లోపిస్తుందని పెద్దలు చెబుతారు

ముత్యం-పగడం మంచిదే

మంగళ సూత్రాలకు ముత్యం, పగడం యాడ్ చేయడం మంచిదే. కుజుడు, చంద్రుడికి ప్రతీకలైన ఈ రెండు రాళ్లు గ్రహదోషాలను తొలగించి వైవాహిక బంధాన్ని మరింత పటిష్టం చేస్తుందని విశ్వసిస్తారు. సాధారణంగా స్త్రీలకు కుజ గ్రహ ప్రభావం వలన అతికోపం, కలహాలు, మొండితనం, అనారోగ్యం, రుతుదోషాలు వస్తుంటాయి. పగడం, ముత్యం ధరించడం వల్ల వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఏ ఇంట్లో అయినా స్త్రీ ప్రశాంతంగా ఉంటే అంతకుమించిన ఆనందం ఏముంటుంది.

పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగి కూడా చిరంజీవిగా ఉన్నాడంటే అది ఆయన గొప్ప కాదట, పార్వతీ దేవి మెడలో ఉన్న ఆ మంగళ సూత్ర మహిమే అని పురాణాల్లో ఉంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న మంగళసూత్రాన్ని ఆధునికత పేరుతో చాలా మంది పక్కనపెట్టేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version