ఎత్తైన ప్రదేశం నుంచి పడిపోయినట్లు కల తరచూ వస్తోందా? అది దేనికి సంకేతమంటే..!

-

నిద్రలో కలలు రావడం కామన్.. కానీ ఒకటే కల తరుచు వస్తుంటే.. అసలు కలలు ఏం ఊరికే రావు.. వాటికి ఒక రీజన్ ఉంటుందట. స్వప్నశాస్త్రం ప్రకారం.. మనకు వచ్చే కలలు భవిష్యత్తును తెలియజేస్తాయట. అయితే కొన్ని కలలు తెల్లారిన తర్వతా అస్సలు గుర్తుకు ఉండవు. కొన్ని బలంగా మెదడులో ఉండిపోతాయి. తరచుగా కలలో ఎత్తు నుండి పడిపోతుంటే, దాని అర్థం ఏమిటో మీకు తెలుసా?మీరు నిద్రపోతున్నప్పుడు ఏదైనా పట్టుకోవాలని కలలు కంటున్నారా? స్వప్న శాస్త్రం ప్రకారం..మీ సంబంధం సరిగ్గా లేదని దీని అర్థం. అందులో కొన్ని సమస్యలున్నాయి.

చాలా మంది కొన్నిసార్లు పర్వతం నుండి మళ్లీ పడాలని కలలు కంటారు. ఒక రాతి నుండి పడిపోవడం అంటే ఇబ్బంది, వైఫల్యం మొదలైనవి. మీరు ఎత్తైన ప్రదేశం నుండి పడిపోయినప్పుడు మీ పాదాలను నేలపై ఉంచడానికి ప్రయత్నిస్తున్నట్లు కలలు వస్తే.. స్వీయ-అభివృద్ధికి చిహ్నంగా నిపుణులు వివరించారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎత్తైన ప్రదేశం నుండి పడిపోవడం, ఒక వ్యక్తి క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు లేదా సమస్యకు పరిష్కారం కనుగొనలేనప్పుడు, ఈ కల ఆ ఆలోచన నుండి వస్తుందట.

పనిలో లేదా ఇంట్లో ఏదైనా సమస్యను ఎదుర్కొన్నప్పుడు వ్యక్తులు సాధారణంగా ఇలాంటి కలలు కంటారు. కలలు మన మానసికి స్టేటస్ ను బట్టే వస్తాయి. మనం ఏదైనా సమస్యతో బాధపడుతున్నా, ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నా.. అప్పుడు ఆ యాంగిల్ కు తగిగ కలలు వస్తాయి. కలలో ఉద్యోగం పోయినట్లు కూడా వస్తుంది. ఇక ఈ కల రాగానే.. ఓ హైరానా పడిపోనక్కర్లేదు. దాని అర్థం మీకు నిజంగా ఉద్యోగం పోతుందని కాదు.. మీరు మనసులో నిశ్చలంగా లేరు..పరిపరివిధాల ఆలోచిస్తున్నారు, అయోమయంలో ఉన్నప్పుడు ఇలాంటి కలలు వస్తాయట.

కలలో బొద్దికంలు కనిపించినా కూడా మీరు భయపడనక్కర్లేదు. అది కూడా మంచికి సంకేతమే..మీరు ఏదో అంశంలో పట్టుదలతో విజయం సాధిస్తారని వాటి అర్థమట.

ఇంకా కలల గురించి చాలా స్వప్నశాస్త్రంలో చాలా విషయాలు చెప్పారు. మనకు టైం ఉన్నప్పుడు వీటి గురించి తెలుసుకుంటుంటే.. మంచి టైం పాస్ తో పాటు. విషయ పరిజ్ఞానం కూడా వస్తుంది. ఇలాంటి వాటని నమ్మని వారు కూడా ఉంటారు. ప్రాబ్లమ్ ఏం లేదు.. లైట్ తీసుకుని లాగించేయడమే.. !

Read more RELATED
Recommended to you

Exit mobile version