ఉదయాన్నే బ్రష్‌ చేయకుండా నీళ్లు తాగుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి..

-

కొందరు ఉదయం లేవగానే.. వాటర్‌ తాగుతారు. బ్రష్‌ కూడా చేయకుండానే వాటర్‌ తాగుతారు. అలా తాగితేనే తాగిన పది నిమిషాల్లో విరోచనం అవుతుంది. ఆరోగ్యానకి మంచిది అనుకుంటారు. మరికొందరు బ్రష్‌ చేసిన వెంటనే ఏం తినకుండా గటగటా వాటర్‌ తాగేస్తారు. అసలు బ్రష్‌ చేయకుండా మంచి నీళ్లు తాగడం మంచిదేనా..? దీని వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏంటో చూద్దాం.. ఈ అలవాటు అయితే కచ్చితంగా చాలా మందికి ఉంటుంది కదా..! తప్పక తెలుసుకుందాం.!

బ్రష్ చేసుకునే ముందు నీళ్లు తాగితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మీ ఆహారాన్ని కూడా జీర్ణం చేస్తుంది. శరీరంలో మలబద్ధకం, మొటిమలు, కడుపు వ్యాధి, అజీర్ణం సమస్య వంటి అనేక వ్యాధులు రాకుండా ఉంటాయి, బ్రష్ చేయకుండా నీళ్ళు తాగితే మన శరీరంలో మురికి మొత్తం తొలగిపోతుంది.

ఉదయాన్నే శరీరాన్ని హైడ్రేట్ చేయడం చాలా ముఖ్యం. నిద్రలో అంటే 7-8 గంటల మధ్య మనం నీళ్లు తాగము. కాబట్టి మీరు ఉదయాన్నే ముందుగా నీరు త్రాగాలి. కాబట్టి మీ శరీరం ముందుగా హైడ్రేట్ అవుతుంది. నోటిలో బ్యాక్టీరియా ఉండదు. నోటిలో సూక్ష్మక్రిములు ఉన్నంత మాత్రాన నోరు కడుక్కోకుండా నీటిని తాగడం వల్ల నోటిలో క్రిములు లేకుండా పోతాయి.

ఉదయాన్నే బ్రష్‌ చేయకుండానే నీళ్లు తాగితే.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మీకు జలుబు, దగ్గు రాదు. అలాగే జుట్టును ఆరోగ్యవంతంగా పెరుగుతుంది.ఉదయం పూట నీరు తాగడం వల్ల అధిక బీపీ, మధుమేహం వంటి వ్యాధులు దరిచేరవు. అలాగే ఉదయాన్నే పరగడుపున నీళ్లు తాగితే ఊబకాయం సమస్య నుంచి బయటపడొచ్చు. మీరు బరువు తగ్గాలనుకుంటే, ఖాళీ కడుపుతో నీరు త్రాగాలి. ఉదయం పూట బ్రష్ చేయకుండా నీరు తాగడం మంచిది.

నోటి దుర్వాసన ఉండదు. నోరు పొడిబారడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. అలాంటి సమయంలో ఉదయాన్నే నిద్రలేచి నీటిని తాగితే అనేక సమస్యలకు దూరంగా ఉంటారు. మీరు రాత్రంతా నిద్రపోయినప్పుడు.. కిడ్నీలు వాటి పని అవి చేసుకుని వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. మీరు లేవగానే వాటర్‌ ఎక్కువగా తాగితేనే.. ఆ వ్యర్ధాలు అన్నీ మూత్రం ద్వారా వస్తాయి. ఉదయం లేచిన మూడు గంటల్లో.. కనీసం లీటరన్నర నీళ్లు అయినా తాగాలి.. గ్యాప్‌ ఇచ్చి గ్యాప్‌ ఇచ్చి తాగండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version