Dreams కలలో ఇవి కనిపించాయా.. అయితే త్వరలో లక్ష్మీదేవి రాబోతున్నట్లేనట..!

-

Dreams and its meaning కలల ద్వారా వ్యక్తి రానున్న రోజుల్లో జరగనున్న సంఘటనల గురించి అంచనా వేసుకోవచ్చు.  శాస్త్రం ప్రకారం.. ప్రతీ కలకి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే వస్తువులు మీ కలలోకి వస్తే..ఏం జరుగుతుందో చూద్దాం.

horse riding in Dreams

కలలో గుర్రపు స్వారీ చేస్తున్నట్లు కనిపిస్తే కూడా మీకు మంచే జరగనుందని అర్థం. ఇలా కల రావడం లాభానికి సంకేతం. ఇది కొత్త ఉద్యోగానికి సంబంధించిన సూచనగా కూడా అర్థమట. కలలో ఏనుగు కనిపించడం కూడా శుభప్రదంగా పరిగణించవచ్చు. అంటే మీ చేతికి డబ్బులు అందుతాయి.

మీరు కలలో నిచ్చెన ఎక్కినట్లు వస్తే..మీరు డబ్బు సంపాదించబోతున్నారని అర్థం. అలాంటి కల వస్తే భవిష్యత్తులో మీకు లాభదాయకమైన పనులు జరుగుతాయి.

కలలో అగ్నిని చూడటం లేదా వంట చేయడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీని అర్థం మీరు ఉద్యోగం లేదా ఉపాధిలో పురోగతిని సాధించబోతున్నారని అర్థం.

మీకు కలలో డబ్బు లేదా వ్యాపారం కనిపిస్తే, రాబోయే కొద్ది రోజుల్లో మీరు భారీగా డబ్బును పొందబోతున్నార స్వప్నశాస్త్రం చెబుతుంది.

కలలో రైతును చూడడం లాభానికి సంకేతంగా పరిగణిస్తారట.. పచ్చని వాతావరణం కలలో కనిపించడం లక్ష్మీదేవికి సంకేతంగా చెబుతారు.

కలలో దానిమ్మపండ్లు తింటే డబ్బు వస్తుందట.. కలలో ఈ పండ్లను తినడం లేదా పంపిణీ చేయడం రెండూ మంచిదే..ఈ కల ఆర్థిక స్థితి మెరుగుదలకు చిహ్నంగా చెబుతారు.

కలలో పెరుగును చూడటం భవిష్యత్తులో మీరు చేపట్టబోయే పనుల్లో విజయాన్ని సూచిస్తుంది. తేనె లేదా పాలు కలలో కనిపిస్తే అంతా మంచే జరుగుతుంది. తేనెటీగలను తయారు చేయాలని కలలుకంటున్నట్లయితే, మీరు చేసే పని త్వరలో తీపి ఫలితాన్ని ఇస్తుందని అర్థం. కలలో పెద్ద మొత్తంలో పాలను చూడటం కూడా భవిష్యత్ లో పెద్ద మొత్తంలో సంపద మరియు ఆనందాన్ని సూచిస్తుంది.

తృణధాన్యాలు కుప్ప కనిపించడం కూడా శ్రేయస్కరమే. కలలో రాజభవనం లేదా పెద్ద ఇంటిని సందర్శించడం కూడా మంచి సంకేతంగా చెబుతారు. ఈ కల మీకు భవిష్యతలో భారీగా డబ్బు రాబోతుందని అర్థం.

మీ కలలో 8 సంఖ్య వస్తే సంపద, విజయం మరియు శారీరక ప్రయోజనాలు కలగబోతున్నట్లు అర్థం. చైనీస్ జ్యోతిష్యం ప్రకారం, ఇతర ఆసియా సంస్కృతులకు 8 అదృష్ట సంఖ్యగా పరిగణించబడుతుంది.

పసుపు, ఎరుపు ప్రతిష్టను సూచిస్తాయి. పసుపు బంగారానికి చిహ్నం మరియు రాచరికానికి సూచన. బంగారాన్ని కలలు కనడం అంటే సంపద విలువైన వస్తువులను మీరు పొందబోతున్నారని అర్థం.

గమనిక: పై కథనానికి ఎలాంటి ఆధారాలు లేవు. పాఠకులు ఆస్తకిని దృష్టిలో పెట్టుకుని స్వప్నశాస్త్రం ప్రకారమే మీకు ఈ సమాచారం అందించబడిందని గమనించగలరు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version