వాస్తు: పూజ గదిలో ఈ మార్పులు చేస్తే శుభం కలుగుతుంది..!

-

కొందరి ఇళ్ళల్లో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు కలగడం లేదా అనారోగ్య సమస్యలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అటువంటి వాళ్లు పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరం అయిపోవాలంటే పూజ మందిరం లో ఈ మార్పులు చేయాలని వాస్తు పండితులు అంటున్నారు. అయితే మరి ఆలస్యం ఎందుకు ఆ మార్పుల గురించి మనం ఇప్పుడే చూసేద్దాం.

చెడు అంతా తొలగిపోయి ఆనందం కలగాలంటే ఈ దేవుడి విగ్రహాలను దేవుడి గదిలో పెట్టొద్దు. ఇలా చేయడం వల్ల శుభం కలుగుతుందని నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరం అయిపోతుంది అని పండితులు అంటున్నారు. అయితే పూజ మందిరం లో ఎలాంటి విగ్రహాలు పెట్టాలి..?, ఎలాంటి పెట్టకూడదు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా పూజ మందిరంలో విరిగిపోయిన విగ్రహాలను ఉంచకూడదు. చాలా మంది తెలియక విరిగిపోయిన విగ్రహాలను పెట్టడం జరుగుతుంది.

దీని వల్ల నెగటివ్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది అని గ్రహించాలి. కనుక ఇలాంటి విగ్రహాలని మీరు ఉంచినట్లయితే వాటిని తొలగించడం మంచిది. అదే విధంగా యుద్ధాలు జరుగుతున్న సందర్భాన్ని సూచించే విగ్రహాలు ఉంటే అసలు వాటిని పెట్టకండి. దీని వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉండదు. దేవుడి మందిరంలో ఎప్పుడూ కూడా అందమైనవి ప్రశాంతతనిచ్చేవి పెడితే మంచిది. ఇలా చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది దీనితో ఇబ్బందులు అన్ని దూరమైపోయి.. శుభం కలుగుతుంది. కనుక ఈ తప్పులు చేసి ఉంటే సరి చేసుకోండి. తద్వారా ఇబ్బందులు కూడా వుండవు. ఆనందంగా ఉండచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version