గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల ఏం అవుతుంది..?

-

గురువారం నాడు బృహస్పతి రోజు అని అంటారు. ఈ గ్రహం అన్ని గ్రహాలు కంటే పెద్దది. అయితే పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల ఏం కలుగుతుంది అనేది ఈరోజు తెలుసుకుందాం. అయితే వారం లో ప్రతి రోజు ఒక్కొక్క దేవుడికి, ఒక్కొక్క రంగు కి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాను. ఉదాహరణకు సోమవారం నాడు శివుని ఆరాధిస్తాం. ఆ రోజు శివుడికి ఇష్టమైన తెలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల మంచి జరుగుతుంది అని చెబుతూ ఉంటారు.

అలాగే గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిదని అంటారు. అలానే ఆ రోజు పసుపు రంగు పూలు దేవుడికి అర్పించడం, పసుపు రంగు దుస్తులు ధరించడం చేస్తూ వుంటారు. గురువారం విష్ణుమూర్తిని మరియు బృహస్పతిని కూడా ఆరాధిస్తూ ఉంటారు. విష్ణుమూర్తి అలాగే బృహస్పతికి కూడా పసుపు రంగు అంటే ఇష్టమని పండితులు చెబుతున్నారు.

అందుకనే దేవుడిని ఆరాధించడానికి భక్తులు వెళ్ళినప్పుడు పసుపు రంగు దుస్తులు ధరించడం పసుపు రంగు పండ్లు, స్వీట్లు, పూలు తీసుకెళ్లడం చేస్తూ ఉంటారు. అలానే భగవంతుడికి పసుపు రంగు లో ఉండే వాటిని అర్పిస్తూ ఉంటారు.

పసుపు రంగు ఎందుకు మంచి చేస్తుంది..?

హిందువులు పసుపు రంగుని చాలా భక్తిగా భావిస్తూ ఉంటారు. పెళ్లిళ్లు మొదలైనప్పుడు కూడా పసుపు రంగు తో శ్రీకారం చుడతారు. ఇలా పసుపు రంగు కి ఎంతో ప్రాధాన్యత ఉంది.

పసుపు రంగు దుస్తులు గురువారం నాడు వేసుకుంటే ఏం కలుగుతుంది..?

జ్యోతిష్యం ప్రకారం పసుపు రంగు దుస్తులు వేసుకోవడం వల్ల పెళ్లి కాని వాళ్ళకి త్వరగా పెళ్లి అవుతుంది అని అంటారు. అలాగే పసుపు రంగు దుస్తులు గురువారం నాడు వేసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది మరియు ఆర్థికంగా కూడా బాధలు తొలగిపోతాయని నమ్ముతుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news