ఈ రంగు దారాలనే ఎందుకు కడతారు? అంత శక్తి ఎలా వచ్చింది

-

దాదాపుగా ప్రతీ దేవాలయల్లో ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులు క‌లిపి చేసిన దారాలు కనిపిస్తుంటాయి. ఆ దారాలను  మౌళి అంటారు. వాటిని చేతులకు కంకణాలుగా భక్తులు దరిస్తారు. అయితే మౌళి ఆ రంగులోనే ఎందుకు చేస్తారు..? ఈ మౌళి చేతికి కంకణంగా ఎందుకు దరిస్తారు..? అస‌లు ఆ దారం క‌ట్ట‌డం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి..? దాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసుకుందాం.

బలి చక్రవర్తి కథ తెలుసుకుంటే మౌళి గురించిన వివరణ తెలుస్తుంది. బలి చక్రవర్తిని అంతమొందించేందుకు శ్రీ‌మ‌హావిష్ణువు వామన అవతారం ఎత్తాడన్న విషయం మనకు తెలిసిందే. బలి నిజానికి అసురుడే అయినా దానలు చేయడంలో చాలా గొప్పవాడు. బ‌లి చ‌క్ర‌వ‌ర్తి తన వ‌ద్ద‌కు వచ్చిన వామనుడున్ని చూసి ఏం కావాలో కోరకోమంటాడు. దానికి వామనుడు మూడ‌డుగుల స్థలం కావాల‌ని అడుగుతాడు.

వామ‌నుడు ఒక అడుగును భూమిపై, మ‌రో అడుగుపై ఆకాశంపై పెడ‌తాడు. ఇక మూడో అడుగు ఎక్క‌డ పెట్టాలి అని వామ‌నుడు అడిగితే అప్పుడు బ‌లి ఏ మాత్రం సందేహించ‌కుండా త‌న నెత్తిన పెట్ట‌మంటాడు. దీంతో వామ‌నుడు త‌న కాలిని బ‌లి నెత్తిన పెట్ట‌గానే అత‌ను పాతాళంలోకి పోతాడు. దీంతో బ‌లి దాన గుణానికి మెచ్చిన‌ వామ‌నుడు బ‌లికి మృత్యుంజ‌యుడిగా ఉండేలా వ‌రం ఇస్తూ పైన చెప్పిన ఆ మౌళి అనే దారాన్ని క‌డ‌తాడ‌ట‌. అందుక‌ని అప్ప‌టి నుంచి దాన్ని చేతుల‌కు క‌డుతూ వ‌స్తున్నారు.

అలా మౌళి దారం క‌డితే ఎవ‌రికైనా కీడు జ‌ర‌గ‌ద‌ట‌. మృత్యువు అంత త్వ‌ర‌గా స‌మీపించ‌ద‌ట‌. ఎక్కువ కాలం సుఖంగా బ‌తుకుతార‌ట‌. సాక్షాత్తూ బ్ర‌హ్మ‌, విష్ణు, మ‌హేశ్వ‌రులు, వారి భార్య‌లైన స‌ర‌స్వ‌తి, ల‌క్ష్మి, పార్వ‌తిలు అండ‌గా ఉంటార‌ట‌. ఏ కష్టాల‌ను రానివ్వ‌ర‌ట‌. అందుక‌నే మౌళి దారాల‌ను క‌డ‌తారు. ఇదీ.. ఆ దారం క‌ట్ట‌డం వెనుక ఉన్న ఉద్దేశం.

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులు ఎందుకు వాడతారు?
ఇక అవే రంగులు ఎందుకంటే… ఆ మూడు రంగులు న‌వ‌గ్ర‌హాల్లో మూడింటిని ప్ర‌తిబింబిస్తాయి. అవి బృహ‌స్ప‌తి, కుజుడు, సూర్యుడు. వీరు వ్య‌క్తుల ఐశ్వ‌ర్యానికి, సుఖానికి, విద్య‌కు, ఆరోగ్యానికి కార‌కుల‌ట‌. అందుక‌ని ఆ గ్ర‌హ పీడ ఉండొద్ద‌నే ఉద్దేశంతో ఆ రంగుల‌తో ఉన్న మౌళి దారాన్ని క‌డ‌తారు. ఇక దీన్ని మ‌గ‌వారికి కుడి చేతికి క‌డ‌తారు. ఆడ‌వారికి ఎడ‌మ చేతికి క‌డ‌తారు. పెళ్లి కాని ఆడ‌వారైతే వారికి కూడా కుడి చేతికే క‌డ‌తారు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version