ప్రతి ఒక్కరికి కూడా కలలు సహజంగా వస్తుంటాయి. నిద్రపోయినప్పుడు అనేక కలలో వస్తూ ఉంటాయి. కలలో ఒక్కోసారి వింతలు, విచిత్రాలు కూడా జరుగుతుంటాయి. కొన్నిసార్లు ఏవేవో కలలు వస్తూ ఉంటాయి. అలాంటి కలల గురించి చాలా మంది ఆలోచించి మనసుని కూడా పాడు చేసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి భయంకరమైన పీడ కలలు కూడా వస్తూ ఉంటాయి. అయితే కలలో మురికి నీరు తో స్నానం చేసినట్లు కనపడితే దానికి అర్థం ఏంటి..? దానిని మనం ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. మంచినీటితో స్నానం చేసినట్లు కల వస్తే చాలా మంచి కలగా భావించొచ్చు.
ఇలాంటి కల వస్తే ఆనందం, సంపద తీసుకువస్తాయట. రాబోయే రోజుల్లో ఆరోగ్యం కూడా బాగుంటుందట. ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వాళ్లకి మంచినీటితో స్నానం చేసినట్లు కల వచ్చిందంటే త్వరలో కోలుకుంటారని అర్థం. ఇలా మంచినీటితో స్నానం చేయాల్సినట్లు కల వస్తే ఇలా మంచి జరుగుతుంది అని అర్థం చేసుకోవచ్చు.
అదే ఒకవేళ మురికి నీటితో స్నానం చేసినట్లు కల వస్తే మానసిక కల్లోలం మిమ్మల్ని వెంటాడుతుందని ఈ కల మిమ్మల్ని హెచ్చరిస్తోంది. అలాగే అన్ని పనుల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. ఈ కల వస్తే మీరు జాగ్రత్తగా ఆలోచించి ప్రమాదంతో కూడిన పనుల్ని చేయకూడదని మిమ్మల్ని హెచ్చరిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. మీ కలలో మీ పాదాలని కడుగుతున్నట్లు కల వస్తే అది మంచి కల అని చెప్పవచ్చు. మీరు చాలా నెలలు లేదా సమస్యలు ఏదో ఒక లక్ష్యాన్ని సాధించాలని కష్టపడుతున్నట్లయితే అది తీరుతుందని భావించాలి.