ఏయే దేవుడి కి ఏయే పువ్వు ఎందుకు నచ్చుతుందో తెలుసుకోండి.

-

హిందూ దేవుళ్ళలో ఒక్కో దేవుడి కి ఒక్కో పువ్వు సమర్పిస్తుంటారు. దేవుడికి ఇష్టం అని చెప్పి రకరకాల పువ్వులను సమర్పిస్తుంటారు. ఆ విధంగా ఒక్కో దేవుడికి ఇష్టమైన ఒక్కో పువ్వు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఎర్రమందారం- కాళీమాత

ఎర్రమందారం కాళీమాతకి బహు ప్రీతి అని చెప్పుకుంటారు. ఎర్ర మందారం కాళీమాత నాలుకకి గుర్తుగా, ఎరుపు రంగు భయం కలిగించే ఆమె రూపానికి గుర్తుగా చెబుతారు. సాధారణంగా ఎర్ర మందారాల దండని కాళీమాతకి సమర్పిస్తారు. 108ఎర్ర మందారాల పువ్వులను మాలగా చేసి కాళీమాత మెడలో వేస్తారు.

పారిజాతం- విష్ణు దేవుడు

క్షీరసాగర మథన సమయంలో పుట్టుకు వచ్చిన చెట్టుగా పారిజాత వృక్షాన్ని చెప్పుకుంటారు. ఈ చెట్టును విష్ణుదేవుడు స్వర్గానికి తీసుకువచ్చాడని, ఆ తర్వాత స్వర్గం మొత్తం సువాసనలతో నిండిపోయిందని, ఆ విధంగా శ్రీవిష్ణువుకి పారిజాతం అంటే ఇష్టమని చెబుతారు.

బంతిపువ్వు – వినాయకుడు

వినాయకుడికి ఇష్టమైన పువ్వు ఇది. బంతిపువ్వు కారణంగా సానుకూలత పెరిగి ఆలోచనల్లో మార్పులు వస్తాయి. అంతే కాదు ప్రతీ పండగ పూట బంతిపూలతో ఇంటినంతా అలంకరించడం మూలాన శుభప్రదంగా ఉంటుందని భావన.

గోగిపువ్వు- సరస్వతీ దేవి

సృజనాత్మకతకు చిహ్నంగా ఉండే ఈ పువ్వు సరస్వతీ దేవికి ఇష్టమైన పువ్వు. జ్ఞానానికి, తెలివికి గుర్తుగా నిలిచే ఈ పువ్వులను సరస్వతీ దేవికి సమర్పించి, జీవితంలో జ్ఞానాన్ని, తెలివిని ఇవ్వమని కోరుకుంటారు.

తులసి- క్రిష్ణ భగవానుడు

క్రిష్ణ తులాభారం గురించి తెలిసిన ప్రతీ ఒక్కరికీ క్రిష్ణుడికి తులసి మొక్క అంటే ఎందుకు ఇష్టమో తెలిసే ఉంటుంది. క్రిష్ణుడిని పూజించే వారు ఖచ్చితంగా తులసి ఆకులను ఆ భగవానుడికి సమర్పిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version