చాలా మంది శివ భక్తులు ఇంట్లో శివుడు విగ్రహాన్ని పెట్టు కోవడం మనం చూసే ఉంటాము..ఇంట్లో లింగాన్ని పెట్టుకుంటే సరిపోదు..కొన్ని నియమాలను కూడా పాటించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.అవేంటో ఒకసారి చుద్దాము..
* ఒక ఇంటిలో ఒక శివలింగం కంటే ఎక్కువ ఉండకూడదని పండితులు చెబుతున్నారు.
* ఒకటి కంటే ఎక్కువగా శివలింగం
ఉండటం వల్ల పూజా విధానంలో విఘ్నాలు కలుగుతాయి. అనేక సమస్యలు వెంటాడుతుంటాయి.
* శివలింగం, సాలగ్రామం, చక్ర చిహ్నంతో ఉండే ద్వారకా శిల, సూర్యకాంతమణి వీటిని రెండు ఉంచి పూజించరాదు.
* ఇంట్లో శివలింగం ఉంచుకొని పూజ చేసేవారు శివలింగాన్ని ఎల్లప్పుడూ దక్షిణం వైపు చూస్తున్నట్లు పెట్టుకోవాలి.
* శివ లింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజ చేయటం వల్ల మనకు ఎలాంటి కష్టాలు కలగకుండా జీవితం సుఖంగా సాగుతుంది.
* ప్రధానంగా శివలింగం ఎంత ఎత్తు ఉంటే మంచిది అంటే అంగుష్టమాత్రం పరిమాణం ఉంటే సర్వ శ్రేష్టం. అంటే మన బొటనవేలు సైజు మించరాదు.
* పొరపాటున కూడా తెలుపు రంగులో ఉన్నటువంటి పాలరాతి శివలింగాన్ని పెట్టుకుని పూజ చేయకూడదు.
* శివలింగానికి నిత్యం అభిషేకం చేయాలి. ప్రతిరోజూ శక్తికొద్దీ అర్చన నిర్వహించాలి. నియమనిష్ఠలతో శివారాధన చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయి..
*. తెలుపు రంగు లింగాన్ని పెట్టకూడదు..మహిళలు అస్సలు ఆ విగ్రహాన్ని ముట్టుకోకుడదు..
* శివలింగం బంగారం, వెండి, క్రిస్టల్ లేదా ఇత్తడితో ఉండాలి. ఇంట్లో ఎప్పుడూ గాజు మొదలైన శివలింగాన్ని ఏర్పాటు చేయవద్దు.
* శివలింగాన్ని పూజించే సమయంలో తులసి ఆకులను ఎప్పుడూ సమర్పించవద్దు.
* శివుడికి బిల్వపత్రం, ఉమ్మెత్త మొదలైనవి మాత్రమే నైవేద్యంగా పెడతారు…
ఇకపొతే రెండు శివలింగాలు ఉన్నట్లయితే, ప్రధాన లింగాన్ని పూజా మందిరంలో ఉంచాలి. రెండోదానిని ఇంటి వెలుపల ఉండే తులసికోటలో ఉత్తరాభిముఖంగా పానవట్టాన్ని ఉంచి పూజలు చేయవచ్చు..
శివునికి లింగార్చన చేసుకుంటే సర్వశుభం అనేది వాస్తవం. అయితే శుచి, శౌచం పాటించాలి. వెండి, బంగారం, సాలగ్రామం, పాలరాయి, పాదరసం లేదంటే మృత్తికతో అప్పటికప్పుడు మట్టితో పార్థివ లింగం తయారుచేసుకుని శివునికి పూజలు చెయ్యవచ్చు.