Vastu Tips : లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉండాలంటే.. ఈ 5 పాటించండి..!

-

Vastu Tips: ప్రతీ ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఆర్థిక ఇబ్బందులే లేకుండా ఆనందంగా ఉండాలని అనుకుంటారు. మీరు కూడా ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ 5 వాస్తు చిట్కాలని పాటించాలి. ఇలా చేయడం వలన మీ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులే ఉండవు.

ఆర్థిక ఇబ్బందులే లేకుండా ఉండాలంటే ఇంట్లో కచ్చితంగా మనీ ప్లాంట్ ఉండాలి. దీని వలన వాస్తు దోషాలు తొలగిపోవడమే కాకుండా సంతోషంగా ఉండడానికి అవుతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ ఉండడం వలన డబ్బులకి అసలు లోటే ఉండదు.
అలాగే అగరబత్తి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది. ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ తొలగిస్తుంది. ప్రతిరోజు ఇంటా అగర్బత్తిని వెలిగించడం వలన వాస్తు ప్రకారం మంచి జరుగుతుంది. చక్కటి పాసిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి.
ఇంటి ముఖద్వారం ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి. అప్పుడే మంచి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. ఇంటి ముఖద్వారం సరిగ్గా లేకపోయినట్లయితే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రాదు. నెగటివ్ ఎనర్జీ కలిగి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇంట్లో నీళ్లు ఎప్పుడూ కూడా లీక్ అవుతూ ఉండకూడదు. అలా లీక్ అవుతున్నట్లయితే వాటిని రిపేర్ చేయించుకోవడం మంచిది. ఇంట్లో నీళ్లు అలా పోతూ ఉండడం వలన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. మీ దగ్గర ఉన్న డబ్బులు కూడా అదే విధంగా ఖర్చయిపోతాయి. కాబట్టి ఈ పొరపాటు కూడా జరగకుండా చూసుకోవాలి.
రాగితో తయారుచేసిన స్వస్తిక్ ని ఇంట్లో ఉంచడం వలన పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. లక్ష్మీదేవి నిత్యం కొలువై ఉంటుంది. సంతోషంగా ఉండడానికి కూడా అవుతుంది. మరి చూశారు కదా ఎలాంటి టిప్స్ నీ ఫాలో అవ్వాలి అనేది. మరి ఇలా చేసి మీ ఇంట్లో కూడా ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version