ప్రభాస్, హృతిక్ ను బీట్ చేసిన శ్రద్ధా కపూర్

-

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్.. స్టార్ హీరోలు ప్రభాస్, హృతిక్ రోషన్ లను బీట్ చేసింది.  శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన స్త్రీ-2 సినిమా గురువారం రోజున రిలీజ్ అయింది. ఈ సినిమా 2024లో బాలీవుడ్​లో అత్యధిక ఓపెనింగ్స్​ సాధించిన సినిమాగా నిలిచింది. ఈ చిత్రం తొలి రోజు రూ.47కోట్లు నెట్ వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

అయితే ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లలోనే కాకుండా ఆల్​ టైమ్ హిందీ ఓపెనింగ్స్​ టాప్-10లో స్థానం దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ వసూళ్లతో ‘స్త్రీ- 2’  7వ స్థానంలో నిలిచే ఛాన్స్ ఉందని టాక్. ఇదే ఏడాది రిలీజైన కల్కి, ఫైటర్ (హిందీ) తొలి రోజు కలెక్షన్ల స్త్రీ-2 దాటేసింది. ఈ సినిమాలు రూ.22- 24కోట్ల మధ్య వసూల్ చేయగా, తాజాగా స్త్రీ-2 రూ.47కోట్లు సాధించింది. అలా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ లను బీట్ చేసింది శ్రద్ధా.

Read more RELATED
Recommended to you

Exit mobile version