Vasthu Tips : చీపురుని ఇంట్లో ఈ దిక్కున ఉంచితే.. లక్ష్మీ దేవి మీ ఇంట్లోనే ఉంటుంది..!

-

Vasthu Tips : వాస్తు ప్రకారం ఫాలో అవ్వడం వలన చక్కటి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. చీపురిని పెట్టేటప్పుడు కొన్ని నియమాలని పాటించాలి ఎలా పడితే అలా చీపురుని పెట్టడం వలన దరిద్రం పట్టుకుంటుంది. ఇబ్బందులు వస్తాయి. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఇంట్లో దరిద్రం తిరిగే అవకాశం ఉంటుంది. అందుకని తప్పులు చేయకుండా చూసుకోండి. చీపురిని పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పక చేసుకోవాలి. చీపురిని కొనడానికి అమావాస్య, మంగళవారం, శనివారం, ఆదివారం మంచిది.

సోమవారం, శుక్లపక్షంలో చీపురిని కొనకూడదు. అది అశుభంగా భావిస్తారు. ఒకవేళ ఈ రోజుల్లో కొంటే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తుపెట్టుకోండి. చీపురుని అసలు వంటగదిలో పెట్టకూడదు. చీపురుని ఎప్పుడు కూడా దక్షిణ, పడమర దిశల మధ్య స్థలంలోనే ఉంచాలి. చీపురుని ఎప్పుడు కూడా నిలబెట్టకూడదు. చీపురుని ఎప్పుడు కింద పడుకోబెట్టాలి. ఇలా మీరు ఈ నియమాలను పాటించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది డబ్బుకి కొరత ఉండదు.

చీపురుని ఏ దిశలో ఉంచారో దానిని ఉపయోగించే దిశ కూడా ముఖ్యం చేసేటప్పుడు ముందు పశ్చిమం లేదా ఉత్తరం వైపు నుంచి తుడుచుకు రావాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలు పెడితే పేదరికం కష్టాలు వస్తాయి. చీపురుని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి సాయంత్రం తర్వాత ఇంట్లో చీపురుని పెట్టడం మంచిది కాదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version