ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ పరిహారాన్ని ప్రయత్నించాల్సిందే..!

-

హిందువులు అందరూ ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవడం సహజమే. విష్ణుమూర్తికి తులసి మొక్క అంటే ఎంతో ఇష్టం. అందువలన ఇంట్లో తులసి మొక్కను పెంచడం వలన లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తి ఆశీస్సులను పొందవచ్చు. సహజంగా ఎటువంటి పండగ వచ్చినా ఇంట్లో తులసి మొక్కను అలంకరించి ఎన్నో పూజలు చేస్తారు. తులసి మొక్కతో పాటు తులసి ఆకులను కూడా ఎన్నో విధాలుగా ఉపయోగించి ప్రయోజనాలను పొందవచ్చు. తులసి ఆకులను పర్సులో పెట్టుకోవడం వలన ఆర్థిక సమస్యలు దూరం అవుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ఎప్పుడైతే అప్పులు ఎక్కువగా ఉంటాయో ఈ వాస్తు నియమాలను పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుందని పండితులు చెబుతున్నారు. తులసి ఆకులను పర్సులో పెట్టుకుంటే, ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి. సహజంగా తులసి మొక్కను లక్ష్మీదేవిగా పూజిస్తారు. ప్రతి రోజు పూజలు చేయడంతో పాటుగా, తులసి మొక్కకు సంబంధించి అనేక నియమాలను పాటిస్తారు. తులసి మొక్కను ముట్టుకోవడం మరియు నీరు అందించడంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అందుకే తులసి మొక్క ఎంతో శక్తివంతమైనది అని భావిస్తారు. ఈ ఆకులను ఉపయోగించి పరిహారాలను పాటించడం వలన ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

తులసి ఆకులను ఎర్రటి గుడ్డలో చుట్టి పర్సులో పెట్టడం వలన ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని వాస్తు పండితులు చెబుతున్నారు. వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నట్లయితే, పూజలో విష్ణుమూర్తికి చందనాన్ని సమర్పించడం మంచిదిగా భావిస్తారు. నైవేద్యంలో లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి తులసి ఆకులను సమర్పించడం వల్ల భార్యాభర్తల మధ్య సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. తులసి ఆకులను ప్రసాదంలో కలిపి నైవేద్యంగా సమర్పించడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు కూడా పొందవచ్చు. పైగా ఇలా చేస్తే జీవితంలో ఎదుర్కొనే దీర్ఘకాలిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని భావిస్తారు. ఈ విధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవించవచ్చని నమ్ముతారు.

Read more RELATED
Recommended to you

Latest news