వాస్తు శాస్త్రంలో చెప్పిన విషయాలను పాటించడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది. కనుక వాస్తు నిపుణులు ఇచ్చేటువంటి సలహాలు మరియు సూచనలు తప్పకుండా పాటించాలి. వాటిని జీవితంలో పాటించడం వలన ఎంతో సంతోషాన్ని పొందవచ్చు. దీంతో ఇంట్లో కేవలం సానుకూల శక్తి ఉంటుంది, ప్రతికూల శక్తి పూర్తిగా తొలగిపోతుంది. ఈ విధంగా ఎంతో ఆనందంగా జీవించవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం మొక్కలకు సంబంధించి కూడా కొన్ని నియమాలను పాటించాలి. ఎప్పుడైతే ఉత్తరం వైపు మొక్కలను నాటుతారో జీవితంలో ఆనందాన్ని, శ్రేయస్సుని పొందవచ్చు.
అయితే ఆనందంగా ఉండడానికి ఎన్నో రకాల పద్ధతులను పాటిస్తున్న సరే వాస్తు శాస్త్రంలో చెప్పినవి పాటించడం వలన మరింత సంతోషంగా ఉండవచ్చు. ముఖ్యంగా సానుకూల శక్తిని పెంచుకోవడానికి వాస్తు నిపుణులు చెప్పిన విషయాలను తప్పకుండా పాటించాలి. ఉత్తరం వైపున కుబేరుడు ఉంటాడు అని వాస్తు శాస్త్రం చెబుతోంది. కనుక ఈ దిశలో మొక్కలను నాటితే ఎంతో ఆనందంగా ఉండవచ్చు మరియు ఆర్థిక సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. ఉత్తరం వైపున మనీ ప్లాంట్ ను నాటడం వలన మరింత అదృష్టాన్ని పొందవచ్చు మరియు ఆర్థికంగా దృఢంగా మారవచ్చు. అరటి మొక్కను కూడా ఉత్తరం వైపున నాటడం వలన లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందవచ్చు. దీంతో ఎంతో సంతోషంగా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవిస్తారు.
చాలా శాతం మంది వెదురు మొక్కను ఎంతో అదృష్టంగా భావిస్తారు. దీని వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అని నమ్ముతారు. కనుక వెదురు మొక్కను ఉత్తరం వైపున తప్పకుండా పెట్టాలి. మీ ఇంటి ముఖ ద్వారం ఉత్తరం వైపున ఉంటే తప్పకుండా వెదురు మొక్కను నాటండి. వీటితోపాటుగా హిందువులు పూజించే తులసి మొక్క ను తప్పకుండా ఇంట్లో ఉంచాలి. ఉత్తర దిశలో తులసి మొక్క, నారింజ మొక్క లేక నిమ్మ మొక్క వంటివి ఉంచడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోవడంతో పాటుగా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు ఆప్యాయత బలంగా ఉంటాయి. కనుక ఇటువంటి మొక్కలను ఉత్తరం వైపున తప్పకుండా నాటండి.