లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే తులసి మొక్క దగ్గర వీటిని పెట్టండి..!

-

తులసి మొక్కని రోజు మనం ఆరాధిస్తూ ఉంటాము. తులసి మొక్కని పూజించడం వలన మంచి జరుగుతుంది. తులసి మొక్క ఇంట్లో ఉంటే సానుకూల శక్తి ప్రవహిస్తుంది. హిందూ మతంలో తులసి మొక్కని ఎంతో పవిత్రంగా భావిస్తాము. ప్రతి ఒక్క హిందువు ఇంట్లో కూడా ఖచ్చితంగా తులసి మొక్క ఉంటుంది. ఇంట్లో తులసి మొక్కని పెంచుకోవడం వలన అనేక లాభాలని పొందవచ్చు. తులసి దగ్గర కొన్ని ప్రత్యేకమైన వస్తువులను పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సంపద పెరగడమే కాకుండా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సాయంత్రం పూట తులసి మొక్క దగ్గర నెయ్యితో దీపాన్ని పెడితే మంచిది.

నెయ్యి దీపాన్ని తులసి దగ్గర పెట్టినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సంపద కూడా పెరుగుతుంది. తులసి కోటను ఎర్రటి గుడ్డతో కట్టి భద్రంగా పెట్టినట్లయితే దరిద్రం తొలగిపోతుంది. సంతోషంగా ఉండొచ్చు. ధనధాన్యాలు కలుగుతాయి. ఆనందంగా ఉండొచ్చు. మట్టి ప్రమిదిలో నూనె కానీ నెయ్యి కానీ వేసి దీపం పెట్టడం వలన సానుకూల శక్తి ప్రవహించి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. కాబట్టి తులసి దగ్గర మట్టి దీపాన్ని రోజూ పెడుతూ ఉండండి. అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది.

తులసి మొక్క దగ్గర మనీ ప్లాంట్ నాటితే చాలా మంచి జరుగుతుంది. ఇది చాలా శుభప్రదం. తులసిని ప్రసన్నం చేసుకోవాలంటే మనీ ప్లాంట్ ని తులసి మొక్క దగ్గర నాటండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా మనీ ప్లాంట్ ఉండడం వలన సులువుగా బయటపడవచ్చు. తులసి మొక్క దగ్గర అక్షతలు కానీ పసుపు కానీ పెడితే మంచి జరుగుతుంది సానుకూల శక్తి కలుగుతుంది. ఆనందంగా ఉండొచ్చు. ఇబ్బందుల నుంచి గట్టెక్కొచ్చు ఏదైనా లోహాన్ని కూడా తులసి మొక్క దగ్గర పెడితే మంచి జరుగుతుంది ఆనందం శ్రేయస్సు కలుగుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version