టాలీవుడ్ నటుడు మోహన్ బాబు తనవద్ద ఉన్న గన్ ను సోమవారం చంద్రగిరి పోలీసులకు సరెండర్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా నేడు తన వద్ద ఉన్న మరో గన్ కూడా మోహన్ బాబు పోలీసులకు సరెండర్ చేశారు. కాగా ఈ రెండవ గన్ ను ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేశారు. అయితే జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబు అరెస్ట్ పై ఎలాంటి ఆలస్యం లేదని, కోర్ట్ ఈనెల 24 వరకు మినహాయింపు ఇవ్వడం వల్లే వేచి చూస్తున్నామని రాచకొండ సీపీ సుధీర్ బాబు వివరణ ఇచ్చారు.
గడువు ముగిసిన తర్వాత హాజరు కాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ
నేపథ్యంలో మోహన్బాబు తన వద్ద ఉన్న రెండు గన్స్ సరెండర్ చేయడంతో సస్పెన్స్ కు తెరపడింది.
ఇక ఆయన విచారణకు హాజరవుతార లేదా అనేది వేచి చూడాలి.