వాస్తు: భార్యభర్తల మధ్య గొడవలా..? బెడ్ రూం లో ఈ మార్పులతో గొడవలు దూరం

-

భార్యాభర్తల మధ్య గొడవలు చాలా సహజం. భార్యాభర్తల మధ్య మాత్రమే కాదు ఏ ఇద్దరు మనుషులు కలిసి ఉన్నా కూడా వారి మధ్యల ఏదో ఒక సందర్భంలో చిన్నచిన్న గొడవలు కచ్చితంగా జరుగుతుంటాయి. చిన్న గొడవల సంగతి పక్కన పెట్టేస్తే భార్యాభర్తల మధ్య క్రమం తప్పకుండా గొడవలు జరుగుతున్నాయంటే.. వారి బెడ్ రూమ్ లో వాస్తు దోషాలు ఉండవచ్చని నిపుణులు అంటున్నారు.

ఆ గొడవలు తగ్గాలంటే బెడ్రూంలో కొన్ని వాస్తు మార్పులు చేస్తే మంచిదని చెబుతున్నారు. ఆ మార్పులు ఎలాంటివో ఇక్కడ తెలుసుకుందాం.

బెడ్ రూమ్ లో చెత్తా చెదారం:

ఒక ఇల్లు నీట్ గా ఉంటే ఆ ఇంట్లో ప్రశాంతత ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
అంతెందుకు.. సైన్స్ కూడా ఈ మాటను నిజమని అంటుంది. పడకగదిలో బెడ్ కింద చినిగిపోయిన పాత బట్టలు ఇంకా ఇతర అవసరం లేని సామాన్లు ఉన్నట్లయితే వాటిని వెంటనే తీసివేయమని నిపుణులు చెబుతున్నారు. చెత్త చెదారం కారణంగా నెగటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

డిస్టర్బ్ చేసే పెయింటింగ్స్:

గదిలో ఎలాంటి పెయింటింగ్స్ ఉన్నా అది చాలా కళాత్మకంగా ఉండాలి. దాన్ని చూడగానే ఒక రకమైన ప్రశాంతత కలగాలి. అలాకాకుండా మీ మనసును ఇబ్బంది పెట్టే నెగెటివ్ షేడ్స్ ఉన్న పెయింటింగ్ ఉండకూడదు. దీనివల్ల భార్యాభర్తల్లో నెగెటివ్ ఆలోచనలు పెరిగి గొడవలకు దారితీస్తుంది.

సరైన బెడ్ లైట్ లేకపోవడం:

గదిలో అస్సలు లైట్ లేకుండా పూర్తిగా చీకటిగా ఉండటం మంచిది కాదు. ఇంకా మన కళ్ళను ఇబ్బంది పెట్టే లైట్ ఉండకూడదు. లైటింగ్ చాలా స్మూత్ గా ఉండాలి.

అక్వేరియం లాంటివి అసలే వద్దు:

బెడ్రూంలో కొంతమంది అక్వేరియం వంటి వాటిని పెట్టుకుంటారు. ఇలాంటి వాటివల్ల నెగెటివ్ ఎనర్జీ పాస్ అయ్యి గొడవలు జరుగుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు.

డిజిటల్ గ్యాడ్జెట్స్:

టీవీలు, లాప్టాప్ లు, కంప్యూటర్లు వంటి వాటిని బెడ్ రూమ్ లో ఉంచకండి. వీటివల్ల మీ నిద్ర సైకిల్ దెబ్బతింటుంది. ఆ కారణంగా మీ భాగస్వామితో గొడవలు జరుగుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version