ఇంట్లో నీళ్ల పైపులు లీకవుతున్నాయా.. ఐతే మీరు సంపాదనంతా వృథా..!

-

ఇళ్లు కట్టేటప్పుడు అందరూ వాస్తు చూస్తారు. వాస్తు ప్రకారమే ఇల్లు కడతారు. కానీ ఇంటి లోపల చిన్న చిన్న విషయాలను లెక్కలోకి తీసుకోరు. ఇంటి లోపల కూడా ప్రతీది వాస్తు ప్రకారం ఉంటేనే ఇంటికి మంచిదట. లేకపోతే ఎంత సంపాదించినా బూడిదలో పోసిన పన్నీరులా అవుతుందట. ఇంట్లో మనశ్సాంతి ఉండదు. తరచూ అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి అని వాస్తు పండితులు చెబుతున్నారు. మరి మీ ఇంటి లోపల అంతా వాస్తు ప్రకారమే ఉందా..? ఇంట్లో వస్తువులన్నీ వాస్తు ప్రకారమే అమర్చారా..?

  • ఇంట్లో ట్యాపులు, పంపులు లీకవుతూ ఉంటే సంపాదించినదంతా హరించుకుపోతుందని చెబుతారు వాస్తుశాస్త్ర నిపుణులు. నల్లాలు లీకవుతున్నప్పుడు వెంటనే మార్చుకోవడం మంచిది
  • ఇంట్లో నీటికి సంబంధించిన పాత్రలు ఎప్పుడూ ఉత్తర దిశలో ఉంచాలి. ఎందుకంటే ఉత్తర దిశలో కుబేరుడు ఉంటాడు. కుబేరుడు సంపదకు సూచిక కావడంతో అక్కడ పెట్టిన నీటిపాత్రలు లీకయ్యేలా ఉండకూడదు.
  • నీటి పాత్రను దక్షిణం లేదా పడమర దిశలో ఎప్పుడూ ఉంచకూడదు. ఇలా ఉంచితే మానసిక ఒత్తిడి రోజురోజుకు పెరుగుతుంది.
  • వాస్తుశాస్త్రం ప్రకారం భూమి పల్లంగా ఉండి తూర్పు వైపున నీటిపారుదల ఉంటే ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి నివసిస్తుందని అంటారు. అంతేకాకుండా ఇంటి సభ్యులు చాలా అభివృద్ధి చెందుతారు. అంతేకాకుండా ఈ దిశలో నీటి పారుదల పెరుగుదల, విస్తరణకు మంచిది. జీవితంలో వచ్చే సమస్యలను, అవరోధాలను సులభంగా పరిష్కరించుకుంటారు.
  • వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తరదిశలో నీరు ప్రవాహం ఉంటే ఆ ఇల్లు శుభప్రదంగా ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది. ఆర్థిక సమస్య అస్సలుండదు.
  • పశ్చిమ దిశలో పల్లం ఉంటే వాస్తుశాస్త్రం ప్రకారం అది అశుభంగా పరిగణిస్తారు. అది ఇంటి సభ్యులపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.ఆర్థికంగా చాలా నష్టపోతారు, ఇంట్లో చీటికి మాటికి తగాదాలు జరుగుతాయి.
  • నీరు దక్షిణ దిశవైపు ప్రవహిస్తే ఈ ఇంట్లో ఉండేవారికి అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. అంతేకాకుండా కొన్ని అవాంఛనీయం సంఘటనలు జరిగే అవకాశముంది. ఇంటి సభ్యులందరూ ఎంత కష్టపడి పనిచేసినా సమస్యల చుట్టుముడతాయి.
  • వాస్తు ప్రకారం నీరు ఈశాన్యంవైపు పల్లం ఉంటే కుటుంబ సభ్యులకు అదృష్టం కలిసొస్తుంది.గౌరవ, ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ ఇంట్లో ఉండేవారంతా ప్రశాంతంగా ఉంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.
  • ఇంటి వాలు నైరుతి దిశలో ఉంటే ఇంట్లో నివసించే ప్రజలు చెడు అలవాట్లు, వ్యాధులకు గురవుతారు. శత్రువుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని వాస్తు పండితులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version