నిర్మల్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.కుబీర్ మండలం కేంద్రంలోని అన్నపూర్ణ ఎంటర్ ప్రైజెస్(దుకాణం)లో శుక్రవారం తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం వలన దుకాణంలోని విలువైన ఫ్రీజ్‌లు, టీవీలు, కులర్లు, ఇతర వస్తువుల అగ్నికి ఆహుతి
అయ్యాయి.
షార్ట్ సర్క్యూట్ కారణం అగ్ని ప్రమాదం సంభవించినట్లు స్థానికులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలను అర్పివేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కరెంట్ షాక్ సర్య్కూట్ వల్లే జరిగిందా? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.