తిరుమల ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. కుప్పం బందోబస్తుకు సిబ్బంది తరలింపు చేయడంపై అనంతపురం రేంజ్ డిఐజి క్లారిటీ ఇచ్చారు. తిరుమల టోకేన్లు జారి సమయంలో భధ్రత సిబ్బంది మళ్లింపు జరగలేదన్నారు. కుప్పం బందోబస్తుకు, పోలిస్ రిక్రూట్మెంట్ కి బందోబస్తు మల్లింపు చెయ్యలేదని వివరించారు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసామన్నారు అనంతపురం రేంజ్ డిఐజి.
2500 మంది సిబ్బందితో పది రోజులు పాటు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మొన్న జరిగిన ఘటన పై దర్యాప్తు చేస్తున్నాం….భాద్యులు పై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. మొన్న జరిగిన ఘటన దురదృష్టకరం….ఉహించనిది…భక్తుల భధ్రత పై పూర్తి భరోసా పోలిస్ శాఖ ఇస్తుందన్నారు. ఘటన పై భక్తులు వద్ద ఏదైన ఆధారాలు వుంటే పోలిసులుకు అందించి దర్యాప్తు సహకరించాలని కోరారు.
ఘటన జరిగిన సమయంలో 90 మంది పోలిసులు బైరాగిపట్టడా కేంద్రం వద్ద వున్నారన్నారు. గేటు తెరిచే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అన్న దిశగా దర్యాప్తు ప్రారంభించామని… గేటు తెరవడానికి సంభందిత అధికారి తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అన్నది తెలియాల్సి ఉందని పేర్కొన్నారు అనంతపురం రేంజ్ డిఐజి.