వాస్తు : డబ్బులు మంచినీళ్లలా ఖర్చు అయిపోతున్నాయా..? అయితే తప్పక ఇలా చేయండి..!

-

వాస్తు ప్రకారం అనుసరించడం వలన సమస్యల నుండి బయట పడచ్చు. చాలామంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పండితుల చెప్పినట్లు చేస్తే కచ్చితంగా సమస్యల నుండి బయటపడవచ్చు. అయితే కొందరి ఇళ్లల్లో డబ్బులు మంచినీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఎంత సంపాదిస్తున్నా కూడా ఆ డబ్బులు అలా ఖర్చు అయిపోతాయి. మీ ఇంట్లో కూడా ఇదే పరిస్థితి అయితే కచ్చితంగా మీరు ఈ చిట్కాల్ని ట్రై చేయండి పండితులు ఈరోజు మన కోసం ముఖ్యమైన వాస్తు చిట్కాలు ని అందించారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి.

 

చెత్తాచెదారంతో ఇల్లు ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట ఉండదు పైగా డబ్బులు త్వరగా ఖర్చు అయిపోతాయి. పేదలు అయిపోయే అవకాశం కూడా ఉంది. వాస్తు ప్రకారం ముఖద్వారం దగ్గర ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి. ముఖద్వారం దగ్గర విరిగిపోయినవి పగిలిపోయినవి ఉంచకూడదు దీని వలన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం నీలం రంగు డిబ్బీ లో డబ్బులు వేస్తే చాలా మంచిది. దీన్ని మీరు ఉత్తర దిశలో ఉంచి రోజూ డబ్బులు వేసుకోండి ఇలా చేస్తే డబ్బులు నిలుస్తాయి. ఉత్తరం దిక్కున మనీ ప్లాంట్ ని వేస్తే కూడా ఇంట్లో డబ్బులు వస్తాయి త్వరలో శుభవార్తను అందుకోవడానికి కూడా అవకాశం ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం ప్లాస్టిక్ చెట్లు ప్లాస్టిక్ మొక్కలు ప్లాస్టిక్ పూలని ఉంచదు వీటి వలన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ప్లాస్టిక్ ఫ్లవర్ వాజ్లు వంటివి ఉంచుకోకండి వాస్తు శాస్త్రం ప్రకారం ఈ విధంగా మీరు అనుసరిస్తే లక్ష్మీదేవి మీ ఇంట ఉంటుంది ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడొచ్చు కూడా.

Read more RELATED
Recommended to you

Exit mobile version