అల్పపీడనం ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు పొంగిపొర్లుతున్నాయి వాగులు. ఏర్పేడు మండలం గుడిమల్లం దగ్గర పాముల కాలువ ఉధృతిగా ప్రవహిస్తుంది. ఆరిణియార్ ప్రాజెక్టు నుండి ఐదువేల క్యూసెక్కుల నీటి విడుదల చేసారు అధికారులు. కాళహస్తి నుండి పిచ్చాటూరు వద్ద అరుణానది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. సి.కె.పురం సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో విద్యార్థులను వాగు దాటించిన స్థానికులు, ఐదు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.
కెవిబి పురం మండలంలోని కాళంగి రిజర్వాయర్లో 220 అడుగులకు చేరింది నీరు.. ఆరు మినీ గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు అధికారులు. జలదిగ్బంధనంలో వరదయ్యపాలెం మండలంలోని బి జి ఆర్ కాలనీ ఉండిపోయింది. గోవర్ధనపురం సమీపంలో పాముల కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో చెన్నై వెళ్ళే రహదారిలో తాత్కాలికంగా రాకపోకలు నిలిచిపోయాయి.