వాస్తు: వాచీని తీసేసి ఇలా చేస్తుంటే ఇబ్బందులొస్తాయి..!

-

మన ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య మాట మాట రావడం, ఆరోగ్యపరమైన సమస్యలు ఇలా ఎన్నో సమస్యలుకి మనం గురవుతూ ఉంటాము. అయితే ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే కచ్చితంగా వాస్తును పాటించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఫాలో అవ్వడం వల్ల ఇబ్బందులు తొలగిపోతాయి. అయితే ఈ రోజు మనం వాస్తు పండితులు చెబుతున్న వాస్తు చిట్కాలు చూద్దాం.

 

వీటిని కనుక ఫాలో అయ్యారంటే కచ్చితంగా ఇబ్బందుల నుంచి బయట పడవచ్చు. సాధారణంగా బయటకు వెళ్లేటప్పుడు వాచీని పెట్టుకుంటాము. తిరిగి వచ్చిన తర్వాత మనం దానిని ఎక్కడో ఓ చోట తెలియకుండా పెట్టేస్తూ ఉంటాము. అయితే వాచ్ విషయం లో కనుక ఈ తప్పులు చేశారంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు.

ఇక దాని కోసం చూస్తే… చేతికి పెట్టుకునే వాచీని దిండు కింద పెట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది అని తెలుస్తోంది. వాటిని ధరించి దిండు కింద నిద్రపోయేటప్పుడు పెడుతూ ఉంటారు. అయితే ఇది నిజంగా తప్పని.. దీని వల్ల నిద్ర సమస్యలు వస్తాయని తెలుస్తోంది.

వాటి నుండి వచ్చే ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్స్ నెగిటివ్ ప్రభావాన్ని తీసుకు వస్తాయని.. దీనితో హృదయం మరియు మెదడు పై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుందని తెలుస్తోంది. అలానే ప్రశాంతత లేకుండా ఎప్పుడూ టెన్షన్ ఉంటుందని.. అందుకనే ఈ తప్పు చేయకూడదని పండితులు అంటున్నారు. కాబట్టి ఈ తప్పులు అస్సలు చేయకండి దీనితో ఇబ్బందులు తొలగిపోతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version