దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో… పెట్రోల్ ధరలు సెంచరీ దాటగా… ఇక డీజిల్ ధరలు కూడా సెంచరీ కి చేరుతున్నాయి. ఇక తాజాగా ఇండియాలో మరోసారి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 35 పైసలు మరియు లీటర్ డీజిల్ పై 35 పైసలు పెరిగింది.
దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.04 కు చేరగా డీజిల్ ధర రూ. 98.42 కు పెరిగింది. ముంబై లో రూ. 115.85 , కు చేరగా డీజిల్ ధర రూ. 106.23 కు పెరిగింది. కోల్ కతాలో రూ . 110.49 కు చేరగా డీజిల్ ధర రూ. 101.56 కు పెరిగింది. చెన్నైలో రూ . 106.66 కు చేరగా డీజిల్ ధర రూ. 102.59 కు పెరిగింది. అలాగే హైదరాబాద్ నగరం లో లీటర్ పెట్రోల్ ధర రూ. 114. 12 కు చేరగా డీజిల్ ధర రూ. 107. 40 కు పెరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 116. 27 కు చేరగా డీజిల్ ధర రూ. 108. 89 కు చేరుకుంది.