వాస్తు: ఇలా ప్రశాంతమైన జీవనాన్ని పొంది సంతోషంగా ఉండొచ్చు..!

-

వాస్తు ప్రకారం మనం ఫాలో అయితే చాలా సమస్యల నుంచి సులువుగా బయటపడొచ్చు. వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఎవరైనా కొత్త ఇల్లు నిర్మించాలంటే వాస్తు ప్రకారం ఫాలో అవుతూ ఉంటారు. వాస్తు ప్రకారం ఫాలో అవ్వడం వలన అంతా కలిసి వస్తుందని ఏ ఇబ్బందులు రావని భావిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతమైన జీవనం కోసం చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే ప్రశాంతంగా ఉండొచ్చు. సంతోషంగా ఉండొచ్చు. ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడు నైరుతివైపు ఉండకూడదని గుర్తు పెట్టుకోండి. ముఖ్యంగా ఈ వైపు గేటు అసలు ఉండకూడదు. వంటగది నైరుతిలో ఉంటే సమస్య వస్తుందని గుర్తు పెట్టుకోండి.

వంటగది ఈశాన్యం వైపు ఉండాలి. కొంత ఖాళీ స్థలం ఉండాలి ఇంటి మధ్య కూడా తూర్పు నుంచి పడమరకి విభజించారంటే అనారోగ్య సమస్యలు వస్తాయని గుర్తు పెట్టుకోండి. ఇంటిని ఉత్తరం నుంచి దక్షిణ దాకా విభజించి గోడని కడితే జీవితంలో చీకటి మిగులుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా తూర్పు ఉత్తర ప్రాంతాల్లో శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ఈశాన్యం నైరుతి మూలలో గుండ్రంగా ఉండే వస్తువుల్ని పెట్టకూడదు ఇంటి ముఖద్వారం ఎప్పుడు ఉత్తరం లేదా తూర్పు వైపు ఉండేటట్టు చూసుకోవాలి. తలుపు ఈశాన్య దిక్కులో ఉంటే చాలా మంచిది.

ఇంటి తలుపు ఎట్టి పరిస్థితుల్లో కూడా నైరుతివైపు ఉండకూడదు. ఇంటి మెట్లు ఎప్పుడు ఆగ్నేయం తూర్పు లేదంటే ఉత్తరం వాయువ్యంలో ఉంటే మంచిది. నైరుతి దిశకు సమీపంలో తలుపు ఉంటే ఎప్పుడు ప్రమాదాన్ని ఆహ్వానించినట్లయితే ఉత్తరం కంటే దక్షిణంలో ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే ఇంటి యజమానికి వయసు ప్రభావ సమస్యలు కలుగవచ్చు. తూర్పు వైపు ఇంటి కంటే ఎత్తుగా చెట్లను పెంచినట్లయితే ఏ తప్పు చేయకపోయినా నేరస్తుడిగా నిలబడాల్సి వస్తుంది. ఇంటి బయట కానీ ఇంటి లోపల తూర్పు దిశలో కానీ చెత్త ఉండకూడదు అలా చేస్తే దరిద్రం పట్టుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news