వాస్తు: ఇంట్లో ఏ దిక్కున ఏది పెడితే మంచిదంటే…?

-

వాస్తు ప్రకారం మనం అనుసరిస్తే ఎటువంటి సమస్యలు ఉండకుండా హాయిగా ఉండవచ్చు. వాస్తు ప్రకారం ఫాలో అయితే ఎంత పెద్ద సమస్య అయినా మీ నుండి దూరం అవుతుంది. నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే ఈ రోజు పండితులు చెబుతున్న ముఖ్యమైన వాస్తు చిట్కాల గురించి చూద్దాం.

వీటిని కనుక అనుసరిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ఉండొచ్చు. మరి పండితులు చెబుతున్న అద్భుతమైన చిట్కాలు గురించి ఒక లుక్ వేసేయండి. ఎప్పుడూ కూడా ఇంటి ముఖ ద్వారం తూర్పు లేదా ఉత్తరం వైపుకి ఉండాలి.ఇలా ఉండడం వల్ల ఇంటికి మంచి కలుగుతుంది అదే విధంగా దక్షిణ వైపు కి టాయిలెట్స్ ఉండాలి.

అలానే దక్షిణం వైపు బరువు ఎక్కువ పెట్టకూడదు. దక్షిణం వైపు కిటికీలు కూడా ఉంటే మంచిది కాదు. దక్షిణం వైపు బాగా బరువుగా ఉండే సామాన్లని పెట్టడం వలన నెగటివ్ ఎనర్జీ వస్తుంది. ఇది ఇలా ఉంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే స్వస్తిక్, ఓంకారం వంటి వాటితో ఇంటికి అలంకరించుకుంటే మంచిది. అలానే పడమర వైపు వంటగది, టాయిలెట్స్ ఉంటే కూడా మంచిదే. ఇలా ఇంట్లో వాస్తు ని అనుసరిస్తే సమస్యలు అన్ని తొలగిపోతాయి అలానే ఆనందంగా కూడా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version