Vasthu: ఇంట్లో బీరువా ఆ దిక్కులో పెడితే డబ్బే డబ్బు..!

-

చిన్నచిన్న మార్పులతో జీవితాన్ని హాయిగా మలుచుకోవచ్చు. మనం ఉండే పరిసరాలు శుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కూడా కలుగుతాయి. కొన్నింటిలో వాస్తు పాటిస్తేనే ఇంటికి మంచిదని కొందరు నమ్ముతుంటారు. అందుకే వారి ఇంట్లో వస్తువులు వాస్తు ప్రకారం అమర్చుతారు. ఆరోగ్యం బాగాలేకపోయినా.. మానసికంగా సమస్యలు ఎదురైనా వారు మొదట పరిశీలించేది వాస్తునే. ఆ తర్వాతే డాక్టర్ల వద్దకు వెళ్తారు. అయితే ఇంట్లో కొన్ని వస్తువులు వాస్తు ప్రకారం ఉంటేనే మానసిక ప్రశాంతత ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో బీరువా ఏ దిక్కున ఉంటే మంచిదో సూచిస్తున్నారు.

 

వాస్తు అంటే కేవలం ఇంటికే కాదు ఇంట్లో ఉండే వస్తువులకు కూడా ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంట్లో వస్తువులు కూడా వాస్తు ప్రకారం ఉంచితే మానసిక ప్రశాంతత లభిస్తుందని అంటున్నారు. ఇంటి ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేసే డబ్బుని దాచే బీరువాను మీరు ఎక్కడ పెడుతున్నారు? మీ ఇంట్లో బీరువా ఏ దిశలో ఉంది? ఎలాంటి బీరువా కొనుగోలు చేయాలో చూద్దాం..

మీరు బీరువాను కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. స్టోన్స్ లేక మార్బుల్స్​తో తయారు చేసిన వాటిని కొనొద్దు. కలప తో చేసిన వస్తువులు ఇంట్లో ఉంటే ఇళ్లంతా పాజిటివ్ వైబ్స్ ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. అందుకే వీలైతే బీరువాను కూడా కలపతో తయారు చేసింది కొనుగోలు చేయండి.

మీ ఇంట్లో బీరువాను నైరుతి దిశలో పెట్టండి. బీరువా ఫేసింగ్ ఉత్తరం, తూర్పు వైపునకు ఉండేలా చూసుకోండి. ఈ దిశల్లో కాకుండా బీరువా ఇంకా ఏ దిశలో ఉన్న మీకు ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య, మానసిక సమస్యలు తప్పవని వాస్తు పండితులు చెబుతున్నారు.

కొందరు బెడ్​రూంలో బీరువా పెడుతుంటారు. అలాంటి వారు నైరుతి లేదా ఈశాన్యంలో పెట్టుకోవచ్చు. అద్దాలు ఉండే బీరువాను ఎంచుకోవద్దు. బీరువా ఫేసింగ్ బెడ్​వైపునకు ఉండేలా చూసుకోండి. తూర్పు, దక్షిణం వైపున బీరువా తెరిచేలా అమర్చుకోండి.

వాస్తు ప్రకారం మీరు అనుసరించాలి అంటే డబ్బులు, నగలు వంటి వాటిని ఉత్తరం వైపు మాత్రమే పెట్టుకోవాలి ఇలా చేస్తేనే ఆర్థిక పరిస్థితులు మెరుగు పడతాయి. బీరువాలో మీరు సామన్లు పెట్టేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version