హిందూ వివాహాలలో అక్షింతలు ఒక ముఖ్యమైన భాగం. అక్షింతలు అంటే క్షతము కానివి లేదా విరిగిపోనివి అని అర్థం. ఇవి బియ్యం, పసుపు, నెయ్యి లేదా నూనెతో కలిపి తయారుచేస్తారు. పెళ్లిలో పెద్దలు, గురువులు, బంధువులు నూతన వధూవరుల తలపై అక్షింతలు వేసి దీవిస్తారు. ఈ ఆచారం చాలా పవిత్రమైనది అక్షింతలు వేయడం అంటే కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, దీని వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక శాస్త్రీయ రహస్యం ఉంది. ఈ అద్భుతమైన ఆచారం యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందామా..
పవిత్రత మరియు శుభం: అక్షింతలలో ప్రధానంగా ఉపయోగించే బియ్యం పవిత్రతకు సంపదకు చిహ్నం. పసుపు శుభానికి శ్రేయస్సుకు అదృష్టానికి ప్రతీక. ఈ రెండింటి కలయిక నూతన జంటకు అంతులేని శుభాలను తెస్తుంది అని శాస్త్రం చెబుతుంది.
ఆశీర్వాదం, రక్షణ: అక్షింతలు వేసేటప్పుడు పెద్దలు చెప్పే మంత్రాలు, ఆశీర్వచనాలు వధూవరుల మనసులో సానుకూల శక్తిని నింపుతాయి. ఇది వారి జీవితాన్ని సంతోషంగా ఆరోగ్యంగా ఐశ్వర్యవంతంగా సాగించడానికి సహాయపడుతుంది.
పొరపాటు లేని జీవితం : అక్షింతలు అంటే క్షతము కానివి అని అంటారు. ఇది వధూవరుల వైవాహిక జీవితంలో ఎటువంటి పొరపాట్లు విచ్చేదాలు లేకుండా శాశ్వతంగా ఉండాలని కోరుకునే ఆశీర్వాదం.

పసుపు కలిపిన బియ్యం ఒక వ్యక్తి యొక్క శరీరంలోని శక్తిని గ్రహించి మరొక వ్యక్తికి సంక్రమింప చేసే శక్తిని కలిగి ఉంటుందని శాస్త్రం చెబుతుంది. అక్షింతలు వేసేటప్పుడు ఆశీర్వదించే వ్యక్తి యొక్క సానుకూల శక్తి నూతన జంటలోకి ప్రసరిస్తుంది.
అక్షింతల కేవలం పెళ్లి తంతులో ఒక ఆచార మాత్రమే కాదు ఇది ఒక కొత్త జీవితానికి ఆశీర్వచనంతో కూడిన శక్తివంతమైన ఆరంభం. ఇది నూతన జంటకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, అదృష్టం, సంపదలను అందిస్తుందని నమ్మకం. ఈ పవిత్రమైన ఆచారాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మన సంప్రదాయాలు విలువలు మనం మరింత లోతుగా తెలుసుకోవచ్చు.
గమనిక:(పైన ఇచ్చిన సమాచారం ఆధ్యాత్మిక సాంస్కృతిక, నమ్మకాల ఆధారంగా ఇవ్వబడింది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే)