అమరావతిలో ప్రభుత్వం ఇప్పటికే 32 వేల ఎకరాల భూమిని సమీకరించింది. అయితే ఆయా భూముల మధ్యలో ఉన్న 1,800 ఎకరాల భూమిని ఇచ్చేందుకు 80 మంది రైతులు నిరాకరించారు. దీంతో నిర్మాణాలకు ఇబ్బంది కలిగేలా ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

తాజాగా ఆ భూములను సేకరించాలని CRDA నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ కూలింగ్ కింద అప్పగించాలని కోరినప్పటికీ రైతులు అంగీకరించకపోవడంతో ల్యాండ్ అక్విజిషన్ చేయాలని డిసైడ్ అయింది. ఈ విషయం పైన వైసిపి పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
ఇక అటు ఏపీలో ఇంకా మిగిలిన మొత్తం 432 బార్లకు రీనోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో 432 ఓపెన్ కేటగిరీ బార్లు మరియు 4 రిజర్వ్ కేటగిరీ బార్లు ఉన్నాయి. సెప్టెంబర్ 14 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. సెప్టెంబర్ 15 ఉదయం 8 గంటలకు లక్కీడ్రా నిర్వహిస్తారు. ఏపీలో బార్లను తీసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.