అమృతం అంటే ఏంటి..? అర్జునుడుతో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే..?

-

అమృతం అంటే ఏంటి..? ఇది ఎక్కడ దొరుకుతుంది..? జ్ఞానం అంటే ఏంటి దీని వలన ఉపయోగం ఏంటి అని చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అలాగే యజ్ఞాలు ఎందుకు చేయాలి అనేది కూడా చాలా మందికి తెలియదు. మహాభారత గ్రంథం ప్రకారం ఈ విషయాల గురించి కృష్ణుడు అర్జునుడికి ఏమని వివరించారు అనేది చూద్దాం. అమృతం అంటే ఎక్కడో స్వర్గంలో దేవతల ఆహారం అని అనుకుంటాం. కానీ ఆ మాటకి అర్థం తెలిస్తే అది ఎక్కడ లభ్యం అవుతుందనేది అర్థమవుతుంది. అమృతం అంటే మరణించినది, నశించనిది అని అర్థం వస్తాయి. శాశ్వతంగా ఉండేది అని అర్థం. అలాంటి దానికి ఆహారంగా తీసుకుంటే తిన్నవాళ్ళకి కూడా ఆ లక్షణాలే సంక్రమిస్తాయి.

ఎక్కడ దొరుకుతుందో స్పష్టంగా చెప్పారు. కృష్ణుడు గొప్పతనం ప్రదర్శించడానికి కాకుండా వింటున్న వాళ్ళకి అర్ధమయ్యి ఆచరించడానికి వీలుగా ఉండేటట్టు చెప్పారు. ఈ సృష్టికార్యం మొత్తం యజ్ఞస్వరూపమని అన్నారు. యజ్ఞ శేషాన్ని సేవించే వాళ్ళు అమృతాన్ని భుజిస్తారని చెప్పారు. యజ్ఞం అంటే ప్రస్తుతం మనం చూస్తున్న యజ్ఞాలు అని భ్రమ పడొద్దు. యజ్ఞం అంటే స్వప్రయోజనాన్ని ఆశించకుండా చేసే పని ఫలితంగా తాను మాత్రమే పొందాలనుకోకుండా చేసేది. దీనిని అందరూ తెలుసో తెలియకో కొంత దాకా ఆచరిస్తూ ఉంటారు.

పండిన పంట అంతా తినేస్తే అంతటితో అయిపోతుంది తిరిగి పంట తయారవుతుంది మొత్తం అనుభవించాలని కాక త్యాగబుద్ధి ఉండాలి. ఇదే కృషి యజ్ఞం. జ్ఞానపరంగా కూడా ఇది వర్తిస్తుంది గురువు నుంచి తను పొందిన జ్ఞానాన్ని తన వద్దనే ఉంచుకోకుండా ఇతరులకు పంచుకోవడం జ్ఞాన యజ్ఞం. ఏదైనా సుప్రయోజనాన్ని ఆశించకుండా చేసే పనిని యజ్ఞం అంటారు కాబట్టి యజ్ఞం చేస్తూ ఉండాలి దాంతో ఎంతో మంచి జరుగుతుంది ఎంతో అద్భుతంగా అర్జునుడికి శ్రీకృష్ణుడు ఈ విషయాలని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version