ఆడవాళ్లు వంట గదిలో ఈ తప్పులను అస్సలు చెయ్యకండి.. ఎందుకో తెలుసా?

-

వంటగదికి మహారాణులు ఆడవాళ్లు.. వాళ్ళు గరిటే పట్టుకుంటేనే అందరికి పొట్ట నిండుతుంది లేకుంటే లోపల ఎలకలు పరుగేడతాయి..మహిళ ఇంటి శక్తికి మూలం అని పెద్దవారు చెబుతూ ఉంటారు. ఇంట్లో అదృష్టమైన, దురదృష్టమైన వాటన్నిటికీ మహిళలే కారణమని పెద్దవారు చెబుతూ ఉంటారు..మహిళలు తమ రోజువారి పనులలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కుటుంబంలో సంతోషం, ఐశ్వర్యం వెళ్లి విరుస్తుందని పెద్దవారు చెబుతూ ఉంటారు. ఆమె భర్త, సంతానంతో పాటు కుటుంబానికి మేలు చేస్తుందని శాస్త్రాలలో, పురాణాలలో రాశారు..వాళ్ళు చేసే కొన్ని చిన్న పనులు మీ అదృష్టానికి తలుపులు తెరిచి కుటుంబంలో సానుకూల శక్తిని పంచుతాయి.. కుటుంబం ఎప్పుడు సంతోషాలతో వర్ధిల్లాలి అంటే స్త్రీలు ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

 

మహిళలు వంటగదిలోకి ప్రవేశించే ముందు స్నానం చేసి శుభ్రంగా ఉండాలి. స్నానం చేసిన తర్వాతే వంట చేయడం మొదలుపెట్టాలి. స్నానం చేయకుండా వంట చేయడం శ్రేయస్కరం కాదు. అలా చేయడం వలన అన్నపూర్ణేశ్వరీని, అగ్ని దేవుడుని అవమానించినట్లేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే స్నానం చేసిన తర్వాత మాత్రమే వంట చేయాలి. ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం, ధన ధాన్యాలు వృద్ధి చెంది కుటుంబంలో అంతా శుభం జరుగుతుంది. అంతేకాకుండా వంట చేసేటప్పుడు కోపంగా ఉండకూడదు..అలా చేస్తే సంపద మొత్తం హరించుకు పోతుంది..

ఇకపోతే వంట చేసేటప్పుడు మనలోని కోపాన్ని ద్వేషాన్ని దూరంగా ఉంచాలి. అలాగే వంట చేసి తిన్న తర్వాత మూతపెట్టిన పాత్రలను ఒంట గదిలో ఉంచకూడదు. ఈ పాత్రలను పగలు, రాత్రి భోజనం చేసిన తర్వాత శుభ్రంగా కడగాలని శాస్త్రాలలో ఉంది. చాలామంది రాత్రిపూట తిన్న గిన్నెలను అలాగే ఉంచి ఉదయాన్నే శుభ్రం చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా గ్రహాలు, రాశులు కూడా అశుభ ప్రభావాన్ని కలిగిస్తాయి. అందుకే వంట చేసిన వెంటనే ఆ పాత్రలను శుభ్రంగా కడగాలి.. ఇలా వంట గది విషయంలో ఆడవాళ్లు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. అప్పుడే కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లు విరుస్తాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version