రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని, సీఎం కేసీఆర్ అసెంబ్లీని టీఆర్ఎస్ ఆఫీస్గా మార్చారని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. సోమవారం హైదరాబాద్లో అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి వాకౌట్ చేసి ఆమె మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా స్పీకర్లు ఇలా వ్యవహరించలేదని అన్నారు.