అలాంటి అబ్బాయిలను అమ్మాయిలు తెగ ఇష్టపడతారట..! కరెక్ట్ హస్బెండ్ మెటీరియల్

-

ఒకప్పుడు పెళ్లిపీఠల మీదే కాబోయే భర్తను చూశేవారు. కనీసం ఫొటో కూడా చూడకుండా పెళ్లికి ఓకే చెప్పిన అమ్మాయిలు ఉన్నారు. కానీ ఇప్పుడు అలా ఒక్క అమ్మాయి కూడా ఉండడు. వాళ్లకు ఎలాంటి భర్త కావాలి, ఏ ఏ లక్షణాలు ఉండాలి, ఏ ఉద్యోగం చేయాలి ఇలా అన్నీ అమ్మాయిలకు ఓ లెక్క ఉంటది.
వాళ్ల ఇష్టాలకు తగ్గట్టుగానే ఎంచుకుంటున్నారు. వాళ్లు పెట్టుకున్న లిస్ట్ లో లక్షణాలు లేకుండే.. ఆ అబ్బాయిని అస్సలు పెళ్లిచేసుకోవడానికి ఇష్టపడరు. ఇంతకీ అమ్మాయిల లిస్ట్ లో కామన్ గా ఉండే లక్షణాలు ఏంటో చూద్దాం.
జర్మనీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ జోట్టింగెన్, ఫిమేల్ హెల్త్ యాప్ క్లూ అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన విషయాలు పేర్కొన్నారు. అమ్మాయిలు భాగస్వామిని ఎంచుకునే సమయంలో పొడవుగా ఉన్న అబ్బాయిలపై శ్రద్ధ చూపుతారట. దీనికి కారణం పొడవైన అబ్బాయిలు తమకు మంచి జోడిగా అనుకుంటారు. వారితో నడిచేటప్పుడు సురక్షితంగా భావిస్తారుట.

పొడవైన అబ్బాయిలే ఫస్ట్ ఛాయిస్

పొడవైన అబ్బాయిలను చూసి అమ్మాయిలు త్వరగా ఇంప్రెస్ అవుతారు. తమ కంటే తక్కువ ఎత్తు ఉన్న అబ్బాయిలను పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయిలకి ఇష్ట పడదు. అధ్యయనం ప్రకారం..72 శాతం మంది మహిళలు ఆచరణాత్మకమైన, సౌకర్యవంతమైన స్వభావం గల భాగస్వామి కోసం చూస్తారు. ఇతరులను గౌరవించడం తెలిసిన వారిని 60 శాతం మంది ఇష్టపడుతారు. కొద్దిమంది డబ్బున్న అబ్బాయిలను ఇష్టపడుతారు. 25 శాతం మంది అమ్మాయిలు మతం, ఆరాధనలను నమ్మే అబ్బాయిలను ఇష్టపడుతారని తేలింది.
అమ్మాయిలు తమ కుటుంబంతో పాటు ఇతర కుటుంబాలను గౌరవించే అబ్బాయిలంటే ఎక్కువగా ఇష్టపడతారని పరిశోధనలో తేలింది. అబ్బాయిలు ధరించే దుస్తులు, వ్యక్తిత్వంపై కూడా అమ్మాయిలకు చాలా శ్రద్ధ ఉంటుంది.. తెలివి తక్కువ అబ్బాయిలని అమ్మాయిలు ఇష్టపడరు. శ్రద్ధగల, బాధ్యతగల అబ్బాయిలను జీవిత భాగస్వామిగా చేసుకోవాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. స్త్రీలకు గౌరవం ఇ‌వ్వని అబ్బాయిలన్నా అమ్మాయిలకు ఇష్టం ఉండదు. తన ముందే వేరే స్త్రీను కించపరిచేలా మాట్లాడితే వారికి అస్సలు నచ్చదు. అలా అని వేరే స్త్రీని వాళ్ల ముందు పొగిడినా తట్టుకోలేరు. బ్యాలెన్స్ గా ఉండాలి అబ్బాయిలూ..!

Read more RELATED
Recommended to you

Exit mobile version