
తెల్లవారుజామున హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలంలోని ధర్మోజిగూడెం వద్ద ఓ కారు యూటర్న్ తీసుకుంటుండగా.. గరుడ బస్సు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన యువకులు చందు(23), పృథ్వి రాజ్(23) ఇద్దరు మృతి చెందారు. పోలీసులు వారి మృతదేహాలను చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.