ఎవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా నాటిన మొక్కలను పూర్తిస్థాయిలో సంరక్షించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను వేములవాడ అర్బన్ మండలం ఆరేపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటసాయి, సంకెపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి నరేష్ కు సంజాయిషీ మెమోలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాలతో జిల్లా పంచాయతీ అధికారి రవీందర్ జారీ చేశారు. 2 రోజుల్లోగా క్షేత్ర స్థాయిలో లోపాలను సరిదిద్దుకోని సమాధానం ఇవ్వాలని సూచించారు.