పోసాని పై మొత్తం 17 కేసులు.. అన్ని కేసుల్లో బెయిల్స్

-

సినీ నటుడు పోసాని పై మొత్తం 17 కేసులు నమోదు అయ్యాయి. అయితే అన్ని కేసుల్లో కూడా బెయిల్స్ సంబంధిత న్యాయస్థానాలు పోసాని కృష్ణ మురళీకి బెయిల్స్ అందించాయి. నిన్న నర్సరావు పేట కోర్టు, ఇవాళ ఆదోని, విజయవాడ కోర్టుల్లో పోసానికి బెయిల్స్ మంజూరు చేశాయి. అంతకు ముందే రాజంపేట కోర్టు బెయిల్ ఇచ్చింది. పోసాని పై మొత్తంగా 17 కేసులు నమోదు అయ్యాయి. మహాశివరాత్రి రోజు ఫిబ్రవరి 26న హైదరాబాద్ లో అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీసులు పోసానిని అరెస్ట్ చేశారు. 

అన్నమయ్య పోలీసుల అరెస్ట్ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు నమోదు అయ్యాయి. ఒక్కో కేసులో పీటి వారెంట్ కోరుతూ పోలీసులు పలు స్టేషన్లలో విచారించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా రాజంపేటకు తరువాత అక్కడి నుంచి కర్నూలు జిల్లా ఆదోనికి, ఆదోని నుంచి మళ్లీ విజయవాడలోని సూర్యరావుపేటకు, అక్కడ నుంచి మళ్లీ కర్నూలు జైలుకు పంపించారు. 67 ఏళ్ల పోసాని హృద్రోగ సమస్యలతో బాధ పడుతున్నాడు. అన్ని కేసుల్లో బెయిల్ పొందిన పోసాని రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version