తిరుపతిలో దారుణం.. భార్య పై భర్త హత్యాయత్నం..!

-

తిరుపతి జిల్లా పెళ్లకూరు సమీప గ్రామంలో దారుణం జరిగింది. భార్యపై భర్త హత్యాయత్నం చేశారు. శ్రీకాళహస్తికి చెందిన హేమంత్ కుమార్, కడప జిల్లా రైల్వే కోడూరు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకున్నారు. పుట్టించి నుంచి డబ్బులు తీసుకురావాలని కొన్ని రోజులుగా భార్యకు భర్త వేధిస్తున్నారు. ఈ క్రమంలో గొడవలు జరిగాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లారు.

అయితే భార్యకు మాయ మాటలు చెప్పి శ్రీకాళహస్తిలో కాపురం పెట్టారు. కానీ మళ్లీ వారి మధ్య మనస్పర్ధలు కొనసాగాయి. దీంతో భార్యపై హేమంత్ కుమార్ దాడి చేశారు. వైద్యం చేయిస్తానని చెప్పి
పెళ్లకూరు సమీపంలోని గుర్రపు తోట వద్దకు తీసుకెళ్లారు. అనంతరం ఒక్కసారిగా భార్యపై మారనాయుధంతో దాడి చేశారు. దీంతో ఆమె పెద్ద పెద్దగా కేకలు వేశారు. స్థానికులు అక్కడికి రావడంతో హేమంత్ పరారయ్యారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి క్షతగాత్రురాలుని శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న హేమంత్ ని అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version