ఒమిక్రాన్ నేపథ్యంలో కోర్టుల ఆంక్షల విధింపునకు హైకోర్టు సిద్ధమైంది. ఈమేరకు ఫిబ్రవరి 4 వరకు ఉమ్మడి జిల్లాలోని కోర్టులలో కక్షిదారులు, న్యాయ వాదులు పొందే సేవలను వర్చువల్ పద్ధతిలోనే నిర్వహించాలని హైకోర్టు పేర్కొంది. ఈమేరకు జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయసేవాధికార సంస్థ భవనం ఎదుట ఏర్పాటు చేయనున్న బాక్స్‌లోనే పిటిషన్స్ వేయాలని కోరారు. కక్షిదారులు, న్యాయవాదులు ప్రత్యక్షంగా కోర్టుకు రావొద్దన్నారు.