రంగారెడ్డి : రోడ్డు ప్రమాదంలో డెలివరీ బాయ్‌ మృతి

-

accident
accident

అసోంకు చెందిన అమర్‌ రబా(34) గచ్చిబౌలిలో నివాసముంటూ స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం గోపన్‌పల్లి నుండి ఆర్డర్‌ డెలివరీ చేసేందుకు వెళ్తుండగా నల్లగండ్లలో బైక్‌ అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు కొండాపూర్‌లోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. చందానగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version